వెంకీ.. నాగ్.. మధ్యలో మంచు విష్ణు

వెంకీ.. నాగ్.. మధ్యలో మంచు విష్ణు

బాలీవుడ్లో వచ్చే ఏడాది రావాల్సిన సినిమాల రిలీజ్ డేట్లు ఇప్పుడే నిర్ణయం అయిపోతాయి. ముందు బెర్తు బుక్ చేసి పెట్టేస్తారు. ఆ ప్రకారమే రిలీజ్ చేసుకోవాలి. మళ్లీ డేట్ మార్చుకోవాలంటే కనీసం ఆరు నెలలు ఎదురు చూడాలి. ఐతే టాలీవుడ్లో మాత్రం రిలీజ్ డేట్ల విషయంలో ఒక క్లారిటీ ఉండదు. సినిమా అంతా పూర్తయ్యాక అప్పుడు మంచి డేట్ చూసి రిలీజ్ చేయడమే ఆనవాయితీగా వస్తోంది. ఐతే ఈ మధ్య మనవాళ్లు కూడా కొంచెం అడ్వాన్స్ గా రిలీజ్ డేట్లు ప్రకటిస్తున్నారు. పోటీ రోజు రోజుకూ పెరిగిపోతుండటంతో ముందే కర్చీఫ్ వేసేస్తున్నారు. సంక్రాంతి సినిమాలు ఆరు నెలల కిందటే రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసుకున్నాయి.

సంక్రాంతి తర్వాతి మూడు నాలుగు వారాలకు కూడా రిలీజ్ డేట్లు ఫైనలైజ్ అయిపోయాయి. గణతంత్ర దినోత్సవం నాడు వెంకీ మూవీ 'గురు' రిలీజవుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఫిబ్రవరి 10వ తేదీని 'ఓం నమో వెంకటేశాయ' కోసం బుక్ చేశారు.

మధ్యలో ఖాళీగా ఉన్న ఫిబ్రవరి 3వ తేదీని మంచు విష్ణు వాడేసుకోబోతున్నాడు. ఆ రోజు అతడి సినిమా 'లక్కున్నోడు' రిలీజవుతుంది. 'గీతాంజలి' ఫేమ్ రాజ్ కిరణ్ దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించాడు. విష్ణు సరసన హన్సిక కథానాయికగా నటించింది. ఇక ఫిబ్రవరి 24న సాయిధరమ్ సినిమా 'విన్నర్' విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. మధ్యలో ఫిబ్రవరి 17న వచ్చే సినిమా ఏదో తేలాల్సి ఉంది. ఫిబ్రవరిలో ఇంకో నాలుగైదు సినిమాలు విడుదలయ్యే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు