సప్తగిరి.. చాలా చేస్తున్నాడు

సప్తగిరి.. చాలా చేస్తున్నాడు

సప్తగిరి నటుడి అవతారం ఎత్తడానికంటే ముందు దర్శకత్వ శాఖలో పని చేశాడన్న సంగతి చాలామందికి తెలియదు. అతను ఏకంగా ఏడేళ్ల పాటు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. దర్శకుడు కావాలన్నదే అతడి లక్ష్యం. కానీ అనుకోకుండా నటుడి అవతారం ఎత్తాడు. తన టిపికల్ కామెడీ టైమింగ్, స్లాంగ్‌తో కమెడియన్‌గా స్టార్ స్టేటస్ సంపాదించాడు. ఇప్పుడు ఏకంగా హీరో అయిపోతున్నాడు.

ఈ సినిమాకు అతను కేవలం హీరో మాత్రమే కాదు. స్క్రీన్ ప్లే రైటర్ కూడా కావడం విశేషం. టైటిల్ కార్డ్స్‌లో అడిషనల్ స్క్రీన్ ప్లే క్రెడిట్ సప్తగిరికే ఇస్తుండటం విశేషం. ‘తిరుడన్ పోలీస్’ అనే తమిళ సినిమాకు రీమేక్ ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’.

ఐతే తమిళ వెర్షన్‌తో పోలిస్తే 80 శాతం మార్పులతో తెలుగు వెర్షన్‌ను తీర్చిదిద్దారట. ఇందులో మెజారిటీ క్రెడిట్ సప్తగిరిదేనట. అందుకే అతడికి అడిషనల్ స్క్రీన్ ప్లే క్రెడిట్ ఇస్తున్నారు. తాను.. సప్తగిరి కొన్ని నెలల పాటు కలిసి కూర్చుని డిస్కస్ చేసి.. సన్నివేశాలు రాసుకుని ఈ సినిమాను తెరకెక్కించినట్లు చెబుతున్నాడు దర్శకుడు అరుణ్ పవార్. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ తండ్రీ కొడుకుల సెంటిమెంటు నేపథ్యంలో సాగే సినిమా.

తన తండ్రి మరణానికి కారణమైన వాళ్ల మీద హీరో ఎలా పగ తీర్చుకున్నాడనే కథాంశంతో తెరకెక్కింది. ట్రైలర్ చూస్తే రెగ్యులర్ మాస్ హీరోల తరహాలోనే చాలా విన్యాసాలే చేస్తూ కనిపించాడు సప్తగిరి. ఈ శుక్రవారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది.

Saptagiri Express Audio Launch Photos

  • Saptagiri Express Movie Audio Launch
  • Saptagiri Express Movie Audio Launch
  • Saptagiri Express Movie Audio Launch
  • Saptagiri Express Movie Audio Launch
  • Saptagiri Express Movie Audio Launch
  • Saptagiri Express Movie Audio Launch
  • Saptagiri Express Movie Audio Launch
  • Saptagiri Express Movie Audio Launch