పిట్టగోడ మీద కూర్చోని బీటేసేవాడట

పిట్టగోడ మీద కూర్చోని బీటేసేవాడట

జరిగిన దాన్ని అందంగా చెప్పటం ఇప్పుడు పాతదైంది. జరిగిన దాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పటమే లేటేస్ట్ ట్రెండ్. గతంలో మర్యాదల పరదాల నుంచి బయటకు వచ్చేందుకు ప్రముఖులు అస్సలు ఇష్టపడేవారు కాదు. ఇలాంటి మాటలన్నీ మాయగా జనాలు అర్థం చేసుకుంటున్న వేళ.. పరదాలు తొలిగించి అసలేం జరిగిందన్న విషయాన్ని ఓపెన్ గానే పంచేసుకుంటున్న వైనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించటమే కాదు.. ఎంత ఓపెన్ గా చెబుతున్నారో అంటూ క్రేజీగా చూడటం ఈమధ్యన ఎక్కువైంది.

మారిన కాలానికి తగ్గట్లుగా ప్రముఖులు మారిపోతున్నారు. గతానికి భిన్నంగా జరిగింది జరిగినట్లుగా చెప్పటానికి ఏ మాత్రం మొహమాటపడటం లేదు. తాజాగా టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరైన డి.సురేష్ బాబు ఒక ఆసక్తికరమైన ముచ్చట చెప్పుకొచ్చారు. రామానాయుడి కొడుగ్గా.. సినీ రంగంలో తనదైన ముద్ర వేస్తున్న సురేష్ బాబు తాజాగా 'పిట్టగోడ' సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

మరో రోజులో  విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్ కోసం బయటకు వచ్చిన సురేష్ బాబు.. సినిమా టైటిల్ పుణ్యమా అని తన పర్సనల్ విషయాన్నిచెప్పుకొచ్చారు. వయసులో ఉండే వారికి పిట్టగోడతో ఉండే అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాను యూత్ లో ఉన్నప్పుడు పిట్టగోడతో తనకున్న అనుబంధాన్ని బయటపెట్టారు సురేష్ బాబు.

"చెన్నైలో ఉన్నప్పుడు సోమసుందరం గ్రౌండ్ ఎదుట ఓ పిట్టగోడ ఉండేది.  మా బ్యాచ్ కుర్రాళ్లం ఆ పిట్టగోడ ఎక్కి.. క్రికెట్ కబుర్లు ఆడుకునేవాళ్లం. నాకేమోకాస్తంత సిగ్గు ఎక్కువ. అయినా సరే మా బ్యాచ్ తో కలిసి స్కూల్ దగ్గరున్న పిట్టగోడ ఎక్కేవాడ్ని. అమ్మాయిల్లో ఎవరుఏ టైంకి స్కూల్ కి వస్తున్నారో అటెండెన్స్ ని వేసేవాడ్ని" అంటూ తానేం చేసేవాడినో చెప్పేశారు సురేష్ బాబు.

Also Read:


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు