పొట్టిరమేష్ భార్య ఆత్మహత్యకు కారనం అదేనా?

పొట్టిరమేష్ భార్య ఆత్మహత్యకు  కారనం అదేనా?

ఇంకా పూర్తిగా పుష్పించని ఆమె జీవితం నేలరాలిపోయింది. ఎన్నో కలలతో అత్తవారింట అడుగుపెట్టిన ఆమె.. చివరకు అనంతలోకాలకు వెళ్లిపోయింది. వైజాగ్ లో హాస్యనటుడు, డ్యాన్సర్ పొట్టిరమేష్ భార్య ఆత్మహత్య.. ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. వరకట్నం వేధింపులే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు.
   
పొట్టి రమేష్ కు హాస్యనటుడిగా, డ్యాన్సర్ గా మంచి గుర్తింపు ఉంది. వైజాగ్ లో నివాసం ఉండే రమేష్.. షూటింగ్ లు ఉన్నప్పుడు హైదరాబాద్ వెళ్లి వస్తుంటాడు. ఏడాది క్రితమే నెల్లూరుకు చెందిన త్రిపురాంబికతో రమేష్ కు పెళ్లైంది. భార్యాభర్తలు బాగానే ఉన్నా అత్తమామలే వేధించారని త్రిపురాంబిక తల్లి ఫిర్యాదు చేసింది.
     
రమేష్ ఇంట్లో లేని సమయంలో త్రిపురాంబికను అత్త, మామ, ఆడపడుచు, ఆమె భర్త కలిసి మానసికంగా వేధించారని, పైసా కట్నం తేకుండా సోఫాలో కూర్చున్నావని, పనీ పాటా లేకపోతే.. ఇంట్లో పనీ చేయొచ్చు కదా అని సూటిపోటి మాటలన్నారని ఆమె గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
      
వరకట్నం వేధింపుల కేసులో రమేష్ పేరు చేర్చొద్దని కోరినా.. పోలీసులు మాత్రం అందర్నీ విచారించారు. ప్రాథమికంగా వరకట్న వేధింపులే త్రిపురాంబిక ప్రాణాలు తీశాయని తేలిందని, అయితే మరిన్ని ఆధారాల కోసం దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు