చిరు సీక్రెట్.. లారెన్స్ చెప్పేశాడు

చిరు సీక్రెట్.. లారెన్స్ చెప్పేశాడు

ఎంతో ప్రతిష్టాత్మకంగా తన 150వ సినిమాను.. ఖైదీ నంబర్ 150గా.. మెగాస్టార్ చిరంజీవి తెరకెక్కిస్తున్నారు. మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ దర్శకత్వంలో.. దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్ లో.. కాజల్ హీరోయిన్ గా.. తనయుడు రామ్ చరణ్ నిర్మాణంలో కొణిదెల ప్రొడక్షన్స్ పై.. సినిమా శరవేగంగా ముస్తాబవుతోంది.

రీసెంట్ గా రిలీజైన అమ్మడూ.. లెట్స్ డూ కుమ్ముడూ పాట.. ఫ్యాన్స్ ను జోష్ లో ముంచేస్తోంది. ఇప్పుడు మరో విశేషం.. లారెన్స్ నోట బయటికొచ్చింది. సినిమాలో.. ఓపెనింగ్ సాంగ్ అద్భుతంగా వచ్చిందని లారెన్స్ చెప్పాడు. ఆ పాటకు.. తానే డ్యాన్స్ కంపోజర్ అని.. చిరంజీవి ఇరగదీశాడని అన్నాడు.

చాలా రోజుల తర్వాత.. చిరు పాటకు కంపోజ్ చేసే అవకాశం రావడం.. ఆనందంగా ఉందని చెప్పాడు. దీంతో.. చిరు ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. హిట్లర్, బావగారూ బాగున్నారా, ఇంద్ర, ఠాగూర్.. ఇలా లారెన్స్ కంపోజ్ చేసిన చిరు సినిమాల పాటలను వరుసగా గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మరోసారి మ్యాజిక్ రిపీట్ కావడం ఖాయమని నమ్ముతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English