భయపెట్టడానికి రెడీ అవుతున్న పూర్ణ

భయపెట్టడానికి రెడీ అవుతున్న పూర్ణ

సీమ టపాకాయ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో గ్లామర్ క్వీన్ పేరు తెచ్చుకున్న కేరళ కుట్టి పూర్ణ... ఆ తరువాత అల్లరి రవిబాబు సినిమా 'అవును'తో మరింత సుపరిచితం అయింది. ఈ సినిమా సీక్వెల్ 'అవును2'లోనూ నటించి.. రవిబాబు క్యాంప్ హీరోయిన్ అనిపించుకుంది. ఆ మధ్య శ్రీమంతుడు సినిమాలోనూ ఓ పాటలో కనిపించిన ఈ ముద్దుగుమ్మ... ఇటీవల విడుదలైన జయమ్ము నిశ్చయమ్మురా మూవీలో హీరోయిన్ గా నటించి మంచి మార్కులే వేయించుకుంది. గ్రామీణ నేపథ్యం వున్న అమ్మాయి పాత్రలో పూర్ణ నటనకు మంచి మార్కులే పడ్డాయనుకోండి.

ఇప్పుడు మరోసారి ఓ లీడ్ రోల్ పోషిస్తోంది పూర్ణ. ఈ చిత్రం శరవేగంగా కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. 'అవంతిక' పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించాడు. ఈ చిత్రానికి కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం శ్రీరాజ్ బల్లా వహించాడు.. ఈ చిత్రం ట్రైలర్ ను ప్రసాద్ ల్యాబ్ లో సోమవారం ప్రదర్శించారు. ట్రైలర్ చూస్తోంటే..ఇది కూడా ఓ బంగ్లాలో జరిగే హారర్ స్టోరీలా కనిపిస్తోంది. మూఢ నమ్మకాలను ప్రధానాంశంగా చేసుకుని తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. కొన్ని శక్తులను వశం చేసుకోవడానికి ఓ మాంత్రికుడు{సాయాజీ షిండే} అవంతికను నరబలి ఇచ్చే సన్నివేషం.. మొదలుకొని.. ఆమె చంద్రముఖిలా కనిపించే సీన్స్ అన్నీ ఓ రకంగా భయపెట్టేలానే ఉన్నాయి.
చంద్రముఖిలో జ్యోతికిను ఎలాగైతే.. క్షుద్రపూజ మాంత్రికుని ముందు ముఖం నిండా పసుపు... కుంకుమ పూసి... ఆమెను ట్రీట్ చేస్తుంటాడో.. అలానే ఇందులో కూడా పూర్ణను ట్రీట్ చేయడం కొంత ఇంట్రెస్ట్ ను కలిగిస్తోంది ట్రైలర్. అసలే గ్లామర్ క్వీన్ గా పేరు తెచ్చుకున్న పూర్ణ... మరి ఇలాంటి హారర్ క్యారెక్టర్లో ఇంకెలా కనిపిస్తోందో వేచి చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు