తెలుగు నేర్చుకోవాలని లేదు

తెలుగు నేర్చుకోవాలని లేదు

బాలీవుడ్ నటులైనా.. ఇటు కోలీవుడ్ నటులైనా.. తెలుగు ఇండస్ట్రీలో తొందరగానే క్లిక్ అయిపోతారు. ఎందుకంటే.. కథ.. కంటెంట్ వుంటే చాలు అలాంటి సినిమాలను.. అందులో నటించిన నటీనటులను నెత్తిమీద పెట్టేసుకుంటారు తెలుగు ప్రేక్షకులు. టాలీవుడ్ నటులు చాలా మంది పరభాషా చిత్రాల్లో రాణించకపోయినా... పరభాషా నటులు మాత్రం తెలుగులో చాలా మందే టాప్ పొజిషన్లో వుంటున్నారు. దానికి కారణం... వారు కూడా తెలుగు ఆడియన్స్ కు అనుగుణంగా మారిపోవడమే. అలా తొందరగా కనెక్ట్ అయిన వారు వెంటనే తెలుగు నేర్చుకుని డబ్బింగ్ కూడా చెప్పేయడానికి రెడీ అయిపోవారు.

ఉదాహరణకు సూర్య తమ్ముడు కార్తీ. తెలుగులో ఆయనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నాడు 'ఊపిరి' సినిమాకు. ఎందుకంటే.. తెలుగులో కార్తీకి మంచి మార్కెట్ కూడా వుంది. అలానే రకుల్ ప్రీత్ సింగ్, తాప్సీలాంటి ఉత్తరాది అమ్మాయిలు కూడా తెలుగు నేర్చుకుని సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. తమన్నా అయితే... అనర్గళంగా మాట్లాడగలుతోంది కానీ.. ఇంకా డబ్బింగ్ చెప్పుకునేంత కాన్ఫిడెంట్ ఆమెకు లేదనిపిస్తోంది. ఇలా చాలా మంది పరభాషా తారలు తెలుగుపై మక్కువ చూపుతున్నారు.

కానీ స్టైలిష్ విలన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన అరవింద్ స్వామి మాత్రం తనకు తెలుగు నేర్చుకోవడం ఇష్టం లేదట. ఇదే కాదు.. ఇప్పట్లో మరే ఇతర భాషలను నేర్చుకోవాలని కానీ... అందులో నటించాలని కానీ లేదని సెలవిచ్చాడు. దాదాపు పాతికేళ్ల క్రితమే ఈ హ్యాండ్స్ మ్ హీరో రోజా, బొంబాయి, మెరుపు కలలు, దళపతి లాంటి డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్లో అడుగుపెట్టాడు. అయితే అప్పట్లో కూడా ఏం అంత అగ్రెసివ్ గా మూవీస్ చేయలేదు. మధ్యలో యాక్సిడెంట్ కారణంగా ఓ దశాబ్దం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యాడు. సొంత బిజినెస్ లు చూసుకుంటున్నాడు. కడలితో మళ్లీ విలన్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇప్పట్లో పరభాష నేర్చుకుని డబ్బింగ్ చెప్పేంత ఓపిక ఎక్కడొస్తుందనుకున్నాడో ఏమో... తెలుగు నేర్చుకుని సొంతంగా డబ్బింగ్ చెబుతారా అంటే.. అంత ఇంట్రెస్ట్ లేదు.. అంత ఓపిక లేదన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు