పవన్ ట్వీట్ కు కేసు బుక్ అయింది

పవన్ ట్వీట్ కు కేసు బుక్ అయింది

గడిచిన నాలుగు రోజులుగా వరుసగా ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్న జనసేన అధినేత కమ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై తాజాగా ఒక కేసు నమోదైంది. వివిధ అంశాల మీద ట్విట్టర్ లో ట్వీట్ చేస్తున్న ఆయన.. శనివారం చేసిన ట్వీట్లపై ఒకరుఅభ్యంతరం వ్యక్తం చేస్తూ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశారు. సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపనకు సంబంధించి కొన్ని ట్వీట్స్ చేయటం తెలిసిందే.

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి సినిమా థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతాన్ని ప్రదర్శిస్తున్నారు. దీనిపై పవన్ విమర్శిస్తూ కొన్ని ట్వీట్స్ చేశారు. వీటిపై హైకోర్టు న్యాయవాది జనార్దన్ గౌడ్ తాజాగా ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పవన్ తన ట్వీట్స్ తో అవమానించారంటూ ఆరోపించారు. జాతీయ గీతానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ రెచ్చగొడుతున్నారని.. ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ట్వీట్స్ చేసేటప్పుడు కాస్త ఆచితూచి పోస్టులు పెడితే మంచిదేమో..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు