ఔను.. మహేష్ సినిమా వాళ్లదే

ఔను.. మహేష్ సినిమా వాళ్లదే

మొత్తానికి కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్నదే నిజమని తేలిపోయింది. మహేష్ బాబు కెరీర్లో ప్రతిష్టాత్మకమైన 25వ సినిమాను పీవీపీ సినిమా నిర్మించట్లేదు. ఆ ప్రాజెక్టు నుంచి పీవీపీ బయటికి వచ్చేశాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు.. అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మించబోతున్నారు. కొన్నాళ్లుగా ప్రచారంలో ఉన్న ఈ వార్తే నిజమని స్వయంగా దర్శకుడు వంశీ పైడిపల్లే వెల్లడించాడు. ట్విట్టర్లో అతను ఈ సినిమా గురించి క్లియర్ కట్‌గా చెప్పేశాడు.

‘బ్రహ్మోత్సవం’ తర్వాత పీవీపీ వాళ్లకు మరో సినిమా చేస్తానన్న హామీ మేరకు వంశీ పైడిపల్లితో సినిమా కమిటయ్యాడు మహేష్. ఈ ఏడాది మహేష్ పుట్టిన రోజు నాడు ఈ ప్రాజెక్టు గురించి ఘనంగా అనౌన్స్‌మెంట్ ఇచ్చింది పీవీపీ సినిమా. పేపర్లలో.. వెబ్ సైట్లలో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చారు. చివరికి ఎక్కడో తేడా కొట్టి ఈ ప్రాజెక్టు నుంచి పీవీపీ వైదొలగాల్సి వచ్చింది. ఈ సినిమా కోసం తీసుకున్న అడ్వాన్స్ వెనక్కిచ్చేశాడట మహేష్. ఐతే భవిష్యత్తులో పీవీపీ బేనర్లో ఒక సినిమా చేయడానికి మాత్రం హామీ ఇచ్చాడట.

మహేష్ బాబును హీరోగా పరిచయం చేసిన అశ్వనీదత్.. ఆ తర్వాత అతడితో ‘సైనికుడు’ సినిమా చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఇదే వాళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా రావడం. ఇక దిల్ రాజుతో మహేష్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా చేశాడు. ఒకప్పుడు అగ్ర నిర్మాతగా వెలుగొందిన అశ్వనీదత్.. ఇప్పటి అగ్ర నిర్మాతతో కలిసి సినిమా చేస్తుండటం ఆసక్తికరమే. చాలా ఏళ్ల తర్వాత ఈ సినిమాతో దత్ తన ఉనికిని చాటుకోనున్నాడు. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా మొదలవుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English