చరణ్ హీరోయిన్.. ఎవరో తెలిస్తే షాకే

చరణ్ హీరోయిన్.. ఎవరో తెలిస్తే షాకే

మొన్న ‘ధృవ’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ‘బ్రూస్ లీ’ ఫ్లాపైనా రకుల్ ప్రీత్ సింగ్‌నే మళ్లీ ఎందుకు తీసుకున్నారు అని అడిగితే.. తనకలాంటి సెంటిమెంట్లు ఏమీ లేవని చెబుతూ.. చివరగా.. ‘‘ఇంకెవరున్నారు చెప్పండి’’ అంటూ ఒకరకమైన అసహనాన్ని ప్రదర్శించాడు రామ్ చరణ్.

నిజమే.. ప్రస్తుతం తెలుగులో హీరోయిన్ల కొరత మామూలుగా లేదు మరి. ఉన్న స్టార్ హీరోయిన్లతోనే తిప్పి తిప్పి నటించాల్సి వస్తుండటం హీరోలకు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలోనే కొన్నిసార్లు హీరోలు కొంచెం రూటు మార్చి.. అప్ కమింగ్ హీరోయిన్లతోనూ జత కడుతున్నారు. రామ్ చరణ్ కూడా ఇప్పుడు ఆ బాటలోనే నడుస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో అతను చేయబోయే సినిమాలో హీరోయిన్ గా మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్‌ను ఎంచుకున్నారు.

సుకుమార్ తీయబోయేది విలేజ్ బేస్డ్ స్టోరీ. ఈ సినిమాలో విలేజ్ అమ్మాయి పాత్ర కోసం చాలామంది హీరోయిన్లను పరిశీలించి అనుపమను ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. విశేషం ఏంటంటే.. అనుపమ ఇప్పటికే చేసిన రెండు తెలుగు సినిమాల్లోనూ (అఆ, ప్రేమమ్) విలేజ్ అమ్మాయి క్యారెక్టరే చేసింది.

ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ‘శతమానం భవతి’లోనూ ఆమెది గ్రామీణ అమ్మాయి పాత్ర లాగే కనిపిస్తోంది. ఇప్పుడు చరణ్ సరసన కూడా అదే తరహా పాత్ర చేస్తోంది. మొత్తానికి విలేజ్ అమ్మాయి పాత్ర అంటే ముందు అందరికీ అనుపమనే గుర్తుకొస్తున్నట్లుగా ఉంది. పాత్ర ఎలాంటిదైనా చరణ్ లాంటి స్టార్ హీరోతో.. సుకుమార్ లాంటి విలక్షణ దర్శకుడితో పని చేయడం అనుపమకు చాలా పెద్ద అవకాశమే. ఈ అవకాశాన్ని ఆమె ఎంత వరకు సద్వినియోగం చేసుకుంటుందో చూద్దాం

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు