‘ధృవ’ వారంలో ఎంత తెచ్చాడు?

 ‘ధృవ’ వారంలో ఎంత తెచ్చాడు?

తెలుగులో ‘జనతా గ్యారేజ్’ వచ్చిన మూడు నెలలకు వచ్చిన భారీ సినిమా ‘ధృవ’. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో సినిమాలపై తీవ్ర ప్రభావం పడ్డ విపత్కర సమయంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అంచనాల్ని మించి పెర్ఫామ్ చేసింది.

డీమానిటైజేషన్ ఎఫెక్టుగా బాగానే తట్టుకుని.. తొలి వారాంతంలో అంచనాల్ని మించి పెర్ఫామ్ చేసింది. వీకెండ్.. సోమవారం సెలవు తర్వాత కలెక్షన్లు పడ్డాయి కానీ.. మళ్లీ రెండో వీకెండ్లో బాగానే పుంజుకుందీ సినిమా. ఇక తొలి వారం రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.41 కోట్లకు పైగా షేర్ వసూలు చేయడం విశేషం. గ్రాస్ వసూళ్లు రూ.64 కోట్లకు పైనే ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి మంచి ఫిగర్లే.

నైజాం ఏరియాలో ‘ధృవ’ అంచనాల్ని మించి పెర్ఫామ్ చేసింది. అక్కడ రూ.16.5 కోట్ల గ్రాస్.. రూ.10.7 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఇక్కడ ఇంకో మూడు కోట్లు వస్తే బయ్యర్ లాభాల్లోకి అడుగుపెడతాడు. ఇక సీడెడ్ ఏరియాలో ‘ధృవ’ ఫస్ట్ వీక్ వసూళ్లు రూ.4.75 కోట్లు (షేర్)గా ఉన్నాయి. ఇక్కడ గ్రాస్ రూ.6 కోట్లు వచ్చింది. వైజాగ్ లో నాలుగు కోట్ల దాకా షేర్ వచ్చింది.

మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.30 కోట్ల దాకా షేర్ వసూలైంది. అమెరికాలో మిలియన్ క్లబ్బు దాటిన ఈ సినిమా కర్ణాటకలో రూ.5.5 కోట్ల షేర్ వసూలు చేయడం విశేషం. ఐతే ఫస్ట్ వీక్ బాగానే పెర్ఫామ్ చేసినప్పటికీ.. ధృవ ఇంకా చాలాదూరమే ప్రయాణించాలి. ఇంకా రూ.15 కోట్ల దాకా షేర్ వసూలు చేస్తేనే అన్ని ఏరియాల్లోనూ బయ్యర్లు లాభాల బాటలోకి వస్తారు. ఈ వీకెండ్లో వచ్చిన సినిమాల పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటం ‘ధృవ’కు కలిసొచ్చే విషయమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు