ఆ ఇద్దరినీ అనుష్క కలిపిందా?

ఆ ఇద్దరినీ అనుష్క కలిపిందా?

నాగార్జున కథానాయకుడిగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఓ సినిమా. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో హల్ చల్ చేస్తోన్న వార్త ఇది. సెల్వరాఘవన్ తెలుగులో ఓ సినిమా తీయబోతున్నారన్న వార్త ఎప్పట్నుంచో వినిపిస్తున్నా...  ఈ కలయిక గురించి మాత్రం ఇదివరకెప్పుడూ ప్రచారం జరగలేదు. కానీ ఇటీవలే నాగార్జున, సెల్వ రాఘవన్ మధ్య కథ గురించి చర్చలు జరిగాయనీ, కథ కూడా ఓకే అయిపోయిందనీ... ఇది నాగార్జున వందో సినిమా కావొచ్చనీ సంకేతాలు అందుతున్నాయి.  అయితే ఉన్నట్టుండి ఈ కొత్త కాంబినేషన్ తెరపైకి రావడం వెనక అనుష్క కారణమని తెలుస్తోంది.

అనుష్క ఇటీవల సెల్వ రాఘవన్ దర్శకత్వంలో `వర్ణ` అనే సినిమా చేసింది. ఆ సమయంలోనే నాగార్జున గురించి అనుష్క చెప్పిందనీ... అప్పట్నుంచే సెల్వ...  నాగార్జునతో సినిమా గురించి కథలు సిద్ధం చేసుకోవడం మొదలుపెట్టాడనీ అంటున్నారు. నాగార్జున కాంపౌండ్ నుంచి తెరపైకి వచ్చిన కథానాయిక అనుష్క. నాగార్జున అన్నా, వాళ్ళ కుటుంబం అన్నా ప్రత్యేకమైన ఇది ప్రదర్శిస్తుంటుంది. ఆ అనుబంధంతోనే సెల్వనీ, నాగార్జుననీ కలిపిందనీ అంటున్నారు. త్వరలోనే నాగ్,  సెల్వాల కలయికలో సినిమా మొదలు కావొచ్చనీ ప్రచారం సాగుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English