జక్కన్నకి వంద అవార్డులు!

జక్కన్నకి వంద అవార్డులు!

వంద అవార్డులా? ఎవరిచ్చారు ఎక్కడిచ్చారు? అనేదేనా మీ సందేహం. రాజమౌళిలోని ప్రతిభకి ఎవరైనా ఎన్నైనా అవార్డులిస్తారు. ఆయన సృష్టించిన `ఈగ` కేన్స్ మొదలుకొని ప్రపంచం అంతా చుట్టి వచ్చింది. ఎంతోమంది ప్రశంసలు అందుకుంది. అయితే ఆయనకి వంద అవార్డులు దక్కింది `ఈగ` సినిమా గురించి కాదు. ప్రస్తుతం తీస్తున్న`బాహుబలి` తరపున.  సినిమా ఇంకా చిత్రీకరణ దశలో ఉండగా అవార్డులేమిటి అంటారా?

అసలు విషయం ఏంటంటే...  బాహుబలి సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్స్ తీర్చిదిద్దుతున్నారు. కళా దర్శకుడు సాబు సిరిల్ ఆధ్వర్యంలో సెట్స్ వేస్తున్నారు.  ఇటీవల ఫిలిం సిటీ అధినేత, ప్రముఖ మీడియా ఐకాన్ రామోజీ రావు స్వయంగా ఆ సెట్స్ చూడటానికి వెళ్లారట. ఆ సెట్స్ చూసి   ఆశ్చర్యపోయారట. వెంటనే రాజమౌళిని అభినందిస్తూ ఓ లేఖ కూడా రాశారు. ``ఓ కళాఖండాన్ని తీర్చి దిద్దుతున్నారు. ఇలాంటి సినిమాని మా ఫిలిం సిటీలో తీస్తున్నందుకు గర్వంగా ఉంది, మీకు ఎలాంటి సహాయ సహకారాలైనా అందివ్వడానికి మేం సిద్ధం`` అంటూ ఆ లేఖలో రాశారు రామోజీ రావు. దాన్ని జక్కన్న ట్విట్టర్లో పెట్టారు. ``ఈ లేఖ నాకు వంద అవార్డులు వచ్చినంత ఆనందాన్ని ఇచ్చింది`` అంటూ ఆయన కామెంట్ పెట్టారు. ఆ రకంగా వంద అవార్డులు జక్కన్నకి వచ్చాయన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు