ఇంటింటా... సినిమా రిలీజవుతుందట

ఇంటింటా... సినిమా రిలీజవుతుందట

విక్టరీ వెంకటేష్ నుంచి మహేష్ బాబు వరకు స్టార్లుగా ఎదిగిన ఎందరో హీరోల్ని తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత రాఘవేంద్రరావుదే. తన కొడుకు రేవంత్‌ను కూడా అలాగే స్టార్‌ను చేసేస్తాడని ఆశించాడు నిర్మాత యలమంచిలి సాయిబాబా.

బాలయ్యతో 'శ్రీరామరాజ్యం' లాంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించిన తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో రేవంత్ హీరోగా 'ఇంటింటా అన్నమయ్య' సినిమాను మొదలుపెట్టాడు సాయిబాబా. సినిమా చకచకా పూర్తయింది కానీ.. ఎంతకీ విడుదలకు నోచుకోలేదు. ఈ టైటిలే ఏమంత ఆసక్తికరంగా అనిపించలేదు.. పైగా కొత్త హీరో.. దీంతో ఈ సినిమా మీద జనాలకు అంతగా ఆసక్తి లేకపోయింది.

నాలుగేళ్ల ముందు రావాల్సిన ఈ సినిమా ఇంకా ఏవో కారణాల వల్ల విడుదలకు నోచుకోకుండా  ఆగిపోయింది. ఐతే ఇప్పుడు ఆ సినిమాను బయటికి తెస్తున్నారట. త్వరలోనే విడుదలకు సిద్ధం చేస్తున్నారట. రోహిత్ లుక్స్ అయితే బాగున్నాయి. వైజాగ్ సత్యానంద్ దగ్గర అతను శిక్షణ తీసుకోవడం విశేషం. మరి యాక్టింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయో చూడాలి. జర్నీ ఫేమ్ అనన్య ఇందులో కథానాయికగా నటించింది.

కీరవాణి సంగీత దర్శకుడు. అప్పట్లో ఈ సినిమా కోసం చాలా పబ్లిసిటీ చేశారు. బాగా ఖర్చు పెట్టారు. తన కొడుకును లాంచ్ చేయడానికి ఇంత చేస్తే.. అసలు ఆ సినిమా విడుదలకే నోచుకోకుంటే సాయిబాబా ఎంత ఫీలయి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. బహుశా దర్శకేంద్రుడి కొత్త సినిమా 'ఓం నమో వెంకటేశాయ' విడుదల కావడానికి కొంచెం ముందు ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారేమో.