అక్కడ ఎన్టీఆరే తోపు!

అక్కడ ఎన్టీఆరే తోపు!

ఓవర్సీస్లో మహేష్ మిగిలిన హీరోలకి అందనంత ఎత్తులో వుండేవాడు. అతని ఫ్లాప్ సినిమాలు కూడా అవలీలగా మిలియన్ డాలర్లు సాధిస్తోంటే మహేష్ని మించిన ఓవర్సీస్ కింగ్ లేడని అనుకున్నారు. మాస్ హీరోగా ప్రస్థానం మొదలు పెట్టిన ఎన్టీఆర్కి మొదట్లో ఈ మార్కెట్ అస్సలు కలిసి రాలేదు.

బాద్షాతో తొలిసారిగా మిలియన్ డాలర్ల క్లబ్లో చేరిన ఎన్టీఆర్ ఆ తర్వాత మరో మూడు సినిమాలతో మిలియన్ డాలర్లు సాధించి, మహేష్ తర్వాత అత్యధిక సార్లు ఈ ఫీట్ సాధించిన హీరోగా రికార్డులకెక్కాడు. అంతే కాదు ఈ ఏడాదిలో ఎన్టీఆర్ సినిమాలు రెండూ కలిపి యుఎస్లో 3.8 మిలియన్ డాలర్లు సాధించాయి.

నాన్నకు ప్రేమతో రెండు మిలియన్లు సాధిస్తే, జనతా గ్యారేజ్ కూడా ఆ మార్కుకి దగ్గరగా వచ్చింది. ఈ ఏడాదిలో అత్యధిక గ్రాస్ సాధించిన తెలుగు హీరోగా ఎన్టీఆర్కే కిరీటం దక్కుతుంది.

అయితే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం త్రివిక్రమ్ 'అ ఆ'నే. దాదాపు రెండున్నర మిలియన్ డాలర్ల వసూళ్లతో 'అ ఆ' ఈ ఏడాదిలో వచ్చిన అగ్ర హీరోల సినిమాలన్నిటినీ బీట్ చేసింది. ఓవర్సీస్లో హీరోలతో సమానంగా దర్శకులకి ఎంత క్రేజ్ వుందనే దానికి ఇది నిదర్శనం. ఓవర్సీస్లో దాదాపు ఏడు మిలియన్ డాలర్ల వసూళ్లతో బాహుబలి అగ్రస్థానంలో కొనసాగుతుంది.

వచ్చే ఏడాది విడుదల కాబోతున్న 'బాహుబలి 2' ఈ రికార్డుని బీట్ చేసి పది మిలియన్ డాలర్లు వసూలు చేస్తుందనే అంచనాలున్నాయి. అందుకు అనుగుణంగానే ఆ చిత్రం ప్రదర్శన హక్కుల్ని ఓవర్సీస్లో కనీ వినీ ఎరుగని మొత్తానికి సొంతం చేసుకున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు