అంత దుమారం రేగుతుందనుకోలేదు-రెజీనా

అంత దుమారం రేగుతుందనుకోలేదు-రెజీనా

ఒక హీరోయిన్ తన చేతి వేలికి ఉంగరం తొడిగి ఉన్న ఒక ఫొటో పెట్టి.. నా లైఫ్లో ఇది బిగ్ మూమెంట్ అని కామెంట్ చేస్తే ఎవరైనా ఏమనుకుంటారు? ఎంగేజ్మెంట్ అయిపోయిందనే కదా? రెజీనా విషయంలో జనాలు అలాగే భావించారు. ఐతే రెజీనా ఆ మెసేజ్ పెట్టిన కొన్ని గంటల్లోనే డెలీట్ చేసినా సరే.. జరగాల్సిందంతా జరిగిపోయింది. పెద్ద దుమారమే రేగింది. ఐతే అప్పుడు అంత రచ్చ చేసిన రెజీనా.. ఇప్పుడేమో అంతా సరదాకే చేశా.. ఆ వ్యవహారం అంత పెద్ద దుమారం రేపుతుందని ఊహించలేదు అంటూ కామెడీలు చేస్తోంది.

''ఆ రోజేదో సరదాగా మెసేజ్ పెట్టాను. అది అంత దుమారం రేపుతుందని భావించలేదు. సోషల్మీడియా ద్వారా నా అభిమానులకు చిన్న షాక్ ఇవ్వాలని త్వరలో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నానని పోస్ట్ చేశాను. రియాక్షన్ లా ఉంటుందో చూద్దామనుకుంటే నిప్పంటించిన అడవిలా పెద్ద కలకలాన్నే సృష్టించింది అని చెప్పింది రెజీనా. ఇక నిజమైన పెళ్లి సంగతేంటని రెజీనాను అడిగితే.. నాకు ఏ విషయంలోనూ ముందుగా ప్రణాళిక ఉండదు. అయినా ఏదైనా విధిని బట్టే జరుగుతుంది. పెళ్లి ఎప్పుడు జరగాలని రాసిపెట్టి ఉంటే అప్పుడే జరుగుతుంది. ఎప్పుడు జరిగినా నాది ప్రేమ వివాహమే అవుతుంది'' అని స్పష్టం చేసింది రెజీనా. ప్రేమ పెళ్లే చేసుకుంటా అంటూనే.. తనకు ప్రేమ వ్యవహారాలు నడిపేంత ఖాళీ అసలేమాత్రం లేదని.. ప్రస్తుతానికి తన దృష్టంతా సినిమాలపైనే అని రెజీనా చెప్పడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English