ఆ గంతులేంటి గురువు గారూ?

ఆ గంతులేంటి గురువు గారూ?

ఏదైనా పాత్ర చేయాలని ముచ్చట పడ్డప్పుడు అందుకు అనుగుణంగా నటించడానికి సిద్ధపడాలి కానీ మన ముచ్చట్లు తీర్చుకోవాలని చూడకూడదు. 'గురు' సినిమాకి సంబంధించిన టీజర్ చూసిన వాళ్లకి వెంకటేష్ పెద్ద షాకే ఇచ్చాడు. 'సాలా ఖడూస్' చిత్రానికి రీమేక్ అయిన ఈ చిత్రంలో వెంకీ మధ్య వయస్కుడైన ఒక బాక్సింగ్ కోచ్ పాత్ర చేస్తున్నాడు. ఒరిజినల్లో ఈ పాత్రలో మాధవన్ జీవించాడు. తన లవర్‌బాయ్ ఇమేజ్‌కి అతీతంగా పవర్‌ఫుల్‌గా కనిపించాడు. చాలా హుందాగా, అదే సమయంలో ప్రపంచం మీద విరక్తి చెందినట్టుగా వుండే ఆ పాత్రలో మాధవన్ ఎలాంటి గంతులు వేయలేదు.

కానీ వెంకటేష్ మాత్రం తాగి తందనాలాడే టీజర్‌ని వదిలాడు. ఒరిజినల్ చూసిన వారికి ఇది షాకిచ్చింది. ఆ పాత్ర తీరుకి ఇలాంటి డాన్సులేంటని ముక్కున వేలేసుకున్నారు. వెంకీ ఎంత కొత్తగా ట్రై చేసినా ఒక్కోసారి పాటలు వుండాలని పట్టుబడుతూ వుంటాడని ఇండస్ట్రీలో అంటూ వుంటారు. అయితే దృశ్యంలో అలాంటి వాటి జోలికి పోకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ గురులో మాత్రం పాత్రకి అతీతంగా ప్రవర్తిస్తున్నాడు. మరి తెరపై ఫ్లోలో కొట్టుకుపోతుందో లేక రివర్స్ కొడుతుందో అనేది వేచి చూడాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు