పూరీ జగన్నాథ్ కూడా రిపేర్లకి దిగాడండోయ్

పూరీ జగన్నాథ్ కూడా రిపేర్లకి దిగాడండోయ్

ఒకసారి ఓకే చేసిన షాట్ని మార్చడానికి పూరి జగన్నాథ్ అస్సలు ఇష్టపడడట. ఇంకో టేక్ చేద్దామని హీరో అడిగినా కానీ వద్దని చెప్పేస్తుంటాడట. కథ, మాటలు, స్క్రీన్ప్లే ఏదైనా సరే ఒక్కసారి ఫిక్సయితే ఇక మార్చే పని పెట్టుకోని పూరి తొలిసారి తన సినిమాకి రీషూట్లు చేస్తున్నాడనే రూమర్లు వినిపిస్తున్నాయి. 'ఇజం' ఘోరాతిఘోరంగా ఫ్లాప్ అవడంతో ఇప్పుడు పూరి జగన్నాథ్తో సినిమా చేయడానికి కనీసం యువ హీరోలు కూడా ఆసక్తి చూపించడం లేదు. ఎప్పుడూ తన నెక్స్ట్ సినిమా లైన్లో పెట్టి వుంచే పూరి ఇంతవరకు మరో సినిమా ఓకే చేయించుకోలేదు.

దీంతో చేతిలో వున్న రోగ్ సినిమా ఒక్కటే పూరీకి దిక్కయింది. ఈ చిత్రం చాలా కాలం క్రితమే మొదలైనా కానీ మధ్యలో ఆగిపోయింది. ఎలాగో డిలే అయిన ఈ సినిమాకి పూరి మరమ్మత్తులు చేస్తున్నాడట. కొన్ని సన్నివేశాలని తిరిగి రాసి, వాటిని తిప్పి తీస్తున్నాడట. రీషూట్ల నిమిత్తం తను మాట్లాడుకున్న పారితోషికంలో కొంత వదులుకోవడానికి కూడా పూరి సిద్ధపడ్డట్టు ఇండస్ట్రీ టాక్. ఏదైతేనేమి, ఈ సినిమాతో తిరిగి బౌన్స్ బ్యాక్ అయి పూర్వ వైభవం కోసం చూస్తోన్న పూరి శ్రమ ఫలిస్తుందో లేదో చూడాలి. లేదంటే మళ్లీ తమ్ముడితో సినిమా చేసుకుని ప్రూవ్ చేసుకోవాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు