అప్పుడు మోహన్ బాబు.. ఇప్పుడు జగపతి

అప్పుడు మోహన్ బాబు.. ఇప్పుడు జగపతి

భక్తిలోనూ రక్తి చూపించడం రాఘవేంద్ర రావుకే సాధ్యం. 'అన్నమయ్య' లాంటి భక్తి చిత్రంలో ఆయన తనదైన శైలిలో రసికతను పండించిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. సినిమాలో రొమాన్స్ బాధ్యతను కొంచెం నాగార్జున తీసుకుని.. ఇంకొంచెం మోహన్ బాబుకు అప్పగించాడు.

నాగ్ ఆధ్యాత్మిక బాట పట్టగానే మోహన్ బాబు అందుకుని రోజాతో కలిసి వినోదాన్ని పంచుతాడు. ఆ తర్వాత శ్రీరామదాసు, పాండు రంగడు లాంటి సినిమాల్లోనూ తనదైన శైలిలో రొమాన్స్ పండించాడు రాఘవేంద్రుడు. ఇప్పుడు  'ఓం నమో వెంకటేశాయ'ను కూడా అదే తరహాలో తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం.

'అన్నమయ్య'లో మోహన్ బాబు లాగే.. ఇప్పుడు 'నమో వెంకటేశాయ'లోనూ అదే తరహాలో రాజు పాత్ర ఒకటి ఉంటుందట. ఆ పాత్ర సరదాగా సాగుతుందట. ఆ క్యారెక్టర్నే జగపతిబాబు చేస్తున్నట్లు సమాచారం. ఆయనకు జోడీగా విమలా రామన్ కనిపించబోతోంది. వీళ్లిద్దరి మధ్య సన్నివేశాలు.. పాట రసవత్తరంగా సాగుతాయని అంటున్నారు.

జగపతి ఇంతకుముందు నాగార్జునతో కలిసి 'రావోయి చందమామ' సినిమా చేశాడు. వీళ్లిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. రాఘవేంద్రరావు కాంబినేషన్లోనూ జగపతి కొన్ని సినిమాలు చేశాడు. అందుకే ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నప్పటికీ 'ఓం నమో వెంకటేశాయ' కోసం డేట్లు కేటాయించాడట జగ్గూ భాయ్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు