నాని కాదు.. శర్వానందే

నాని కాదు.. శర్వానందే

ఈ ఏడాదే నాలుగో సినిమాను రిలీజ్ చేసి అందరికీ షాకివ్వాలని చూశాను నేచురల్ స్టార్ నాని. కానీ డిసెంబరు 23కు అనుకున్న 'నేను లోకల్' వాయిదా పడిపోయింది. 16న రావాల్సిన 'సింగం-3' 23కు వాయిదా పడటంతోనే నాని సినిమా రేసు నుంచి తప్పుకుందని అంతా అనుకున్నారు. కానీ వాస్తవం ఏంటంటే ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదు.

సింగం-3 వాయిదా నిర్ణయం వచ్చే సమయానికి ఇంకా షూటింగే అవ్వలేదు. ఇక ఆడియో విడుదల చేసి 23కు సినిమాను ఎక్కడ రిలీజ్ చేస్తారు? మధ్యలో నాని సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసి.. సంక్రాంతికి అనుకున్న 'శతమానం భవతి'ని వాయిదా వేయాలని దిల్ రాజు భావిస్తున్నట్లు వార్తలొచ్చాయి. కానీ అలాంటిదేమీ లేదని తాజా సమాచారం.

'శతమానం భవతి' అనుకున్న ప్రకారమే జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు యూనిట్ వర్గాల సమాచారం. సినిమా మీద చాలా కాన్ఫిడెంటుగా ఉన్న రాజు.. ఇది సంక్రాంతి పండక్కి సరిగ్గా సరిపోయే సినిమా అని భావిస్తున్నారు. ఇలాంటి సినిమాలకు సంక్రాంతి సమయంలో మంచి ఆదరణ ఉంటుందని ఆయన నమ్ముతున్నారు.

ఈ నెలాఖరులో ఆడియో విడుదల చేసి సినిమాను సంక్రాంతికే రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్ సరసన అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. ప్రకాష్ రాజ్ కీలక పాత్రధారి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు