ధృవ టీం చేస్తున్న గొప్ప పని ఇది

ధృవ టీం చేస్తున్న గొప్ప పని ఇది

వేరే భాష నుంచి ఓ హిట్ మూవీని రీమేక్ చేస్తూ.. అసలది రీమేక్ అని కూడా చెప్పకుండా సినిమాలు చేసేవాళ్లు కొందరుంటారు. మాతృక మక్కీకి మక్కీ దించేసి అసలు ఒరిజినల్ రైటర్.. డైరెక్టర్లకు ఏ క్రెడిట్ ఇవ్వకుండా టైటిల్స్‌లో తమ పేర్లే వేసుకునే ప్రబుద్ధులకు కొదవ లేదు.

ఐతే 'ధృవ' టీమ్ మాత్రం దీని మాతృక 'తనీ ఒరువన్'ను తెరకెక్కించిన దర్శకుడు మోహన్ రాజాకు ఫుల్ క్రెడిట్ ఇస్తోంది. మోహన్ రాజా స్క్రిప్టుకు పూర్తి గౌరవం ఇస్తూ.. స్క్రీన్ ప్లేలో ఎలాంటి మార్పులు చేయకుండా దాదాపుగా అలాగే ఫాలో అయిపోయాడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి.

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా స్క్రిప్టు గురించి గొప్పగా చెప్పాడు సురేందర్. చరణ్ సైతం స్క్రిప్టే ఇందులో హీరో అన్నాడు. రాజమౌళి అన్నట్లుగా.. హీరో ఇమేజ్‌ కోసమని ఒరిజినల్ స్క్రిప్టును చెడగొట్టకుండా.. దాన్ని అలాగే ఫాలో అయిపోవడం సినిమాకు మేలు చేసింది. ఇక తెలుగులోనూ ఈ సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ రాగా.. కలెక్షన్లు కూడా బాగున్నాయి. ఈ నేపథ్యంలో సక్సెస్ క్రెడిట్లో మోహన్ రాజాకు భాగం ఇస్తూ ధృవ టీం మాట్లాడుతుండటం విశేషం.

ఇలా రీమేక్ ద్వారా హిట్టు కొట్టినపుడు ఒరిజినల్ గురించి మాట్లాడటం అరుదు. ఐతే యుఎస్‌ టూర్లో ఉన్న 'ధృవ' టీంలో ప్రతి ఒక్కరూ మోహన్ రాజా గురించి మాట్లాడారు. సురేందర్ రెడ్డి.. రామ్ చరణ్.. అరవింద్ స్వామి.. ముగ్గురూ కూడా తమ ప్రసంగాల్లో మోహన్ రాజా ప్రస్తావన తెచ్చారు. ఈ సక్సెస్‌లో అతడికి క్రెడిట్ ఉందన్నారు. మరోవైపు దర్శకుడు రాజమౌళి కూడా 'ధృవ' సినిమా చూసి అందరినీ ప్రశంసిస్తూ.. చివరగా ఫుల్ క్రెడిట్ ఒరిజినల్ రైటర్ మోహన్ రాజాదే అనేశాడు. ఇలా ఒక రీమేక్ సినిమాకు సంబంధించి ఒరిజినల్ డైరెక్టర్ గురించి ఇలా ప్రశంసలు కురిపించడం అరుదు. ఇది మంచి సంప్రదాయం కూడా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English