కారులోనే కోట్లుంటే.. ఇంకెంతుందో..

కారులోనే కోట్లుంటే.. ఇంకెంతుందో..

టీటీడీ మెంబర్ శేఖర్ రెడ్డి బాగోతం చూస్తుంటే.. సామాన్యులకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఏకంగా బీఎండబ్ల్యూ కారులో 24 కోట్ల తళతళలాడే కొత్త నోట్లు దొరకడంతో.. జనం నోరెళ్లబెడుతున్నారు. పోనీ పాతనోట్లు ఉన్నాయంటే ఏదో అనుకోవచ్చు. ఇన్ని కోట్లు కొత్త నోట్లు ఎలా తెచ్చారు. ఎలా మార్చారు ఆ సీక్రెట్ చెప్పండని వేడుకుంటుంటున్నారు.

శేఖర్ రెడ్డి స్టోరీ డబ్బుతోనే అయిపోలేదు. బంగారం కూడా ఉంది. హోటల్ గదిలోనే 12 కిలోల బంగారం దొరకడం సంచలనం రేపింది. ఇంట్లో వంద కేజీల బంగారం దొరికింది. అసలు సాధారణ కాంట్రాక్టర్ అయిన శేఖర్ రెడ్డి ఇంత డబ్బు ఎలా కూడబెట్టారనేది చిదంబర రహస్యం.

శేఖర్ రెడ్డి పాడు పనులతో శ్రీవారి పరువు పోతోంది. శ్రీవారి ఆలయానికి ధర్మకర్తల మండలి సభ్యుడైన శేఖర్ రెడ్డి.. పవిత్రమైన స్థానంలో ఉండి పరువు తీశారని ఏపీ సర్కారు ఆగ్రహంగా ఉంది. శేఖర్ రెడ్డి తొలగింపుకు నిర్ణయం తీసుకున్నా.. చట్టబద్ధమైన ఇబ్బంది రాకుండా కసరత్తు చేస్తోంది.

శేఖర్ రెడ్డి కథ.. అన్నాడీఎంకేలో కూడా కలకలం రేపుతోంది. మామూలు అన్నాడీఎంకే నేత శేఖర్ రెడ్డి దగ్గరే ఇన్నికోట్లుంటే.. ఇక సీనియర్లు, శశికళ దగ్గర ఎంతుందోనని అందరూ లెక్కలేసుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు