సంక్రాంతి రేసులోకి ఆ సినిమా కూడానా?

సంక్రాంతి రేసులోకి ఆ సినిమా కూడానా?

సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీ 'ఖైదీ నెంబర్ 150'తో పాటు.. నందమూరి బాలకృష్ణ వందో సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి'ల మధ్య రసవత్తర సమరం చూడబోతున్నాం. కుదిరితే శర్వానంద్ సినిమా 'శతమానం భవతి' కూడా పండక్కే రావచ్చు. ఐతే వీటి మధ్య ఎవ్వరూ ఊహించని విధంగా మరో సినిమా సంక్రాంతికి రెడీ అవుతోంది. అది పీపుల్స్ స్టార్ నారాయణ మూర్తి నటిస్తున్న 'హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య' కావడం విశేషం. నారాయణమూర్తి కమిటెడ్‌గా సినిమాలు చేస్తాడన్న మాట వాస్తవమే కానీ.. గత కొన్నేళ్లలో ఆయన ప్రభ తగ్గిపోయింది. జనాలు ఆయన సినిమాల్ని పట్టించుకోవడం మానేశారు.

మూమూలుగా తన సినిమాల్ని తనే తీసుకునే నారాయణ మూర్తి చాలా ఏళ్ల తర్వాత బయటి సినిమాలో నటించారు. అదే ఈ 'హెడ్ కానిస్టేబుల్ వెంక్రటామయ్య'. గతంలో చాలా సినిమాలు నిర్మించి.. మధ్యలో గ్యాప్ తీసుకుని... ఈ మధ్య 'బిచ్చగాడు' తో కాసుల పంట పండించుకున్న 'శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్' బేనర్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సంస్థ అధినేత అయిన చదలవాడ శ్రీనివాసరావే ఈ చిత్రానికి దర్శకుడు కూడా. నారాయణమూర్తికి జోడీగా జయసుధ నటించింది ఇందులో. ఈ చిత్రం షూటింగ్ పూర్తయి.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటోందని.. సంక్రాంతికే తమ చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని చదలవాడే ప్రకటించాడు. ఊరికే ప్రచారం కోసం చెప్పారో ఏమో తెలియదు కానీ.. సంక్రాంతికి ఉన్న పోటీ మధ్య ఇలాంటి సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉంటుందా.. రిలీజ్ చేసినా జనాలు అసలు పట్టించుకుంటారా అన్నది సందేహమే

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు