చిరు డ్యాన్స్ బిట్ లీకైపోయింది

చిరు డ్యాన్స్ బిట్ లీకైపోయింది

మెగాస్టార్ చిరంజీవి అంటేనే డ్యాన్సులకు పెట్టింది పేరు. ఆయన సినిమాల నుంచి విరామం తీసుకునే సమయానికి 50 ప్లస్ లో ఉన్నప్పటికీ ఏమీ తగ్గేవాడ కాదు. డ్యాన్సులు ఇరగదీసేవాడు. ఇప్పటికీ తనలో ఆ ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదని ఈ మధ్య మా టీవీ వేడుకలో రుజువుచేశాడు. వేదికెక్కి అదిరిపోయే స్టెప్పులేశాడు.

ఇక చిరు రీఎంట్రీ మూవీ 'ఖైదీ నెంబర్ 150'లోనూ అభిమానులు అత్యంత ఆసక్తిగా చూసేది చిరు డ్యాన్సుల్నే అనడంలో ఎలాంటి సందేహం లేదు. లారెన్స్.. జానీ మాస్టర్.. శేఖర్ మాస్టర్ లాంటి టాప్ కొరియోగ్రాఫర్లు ఈ సినిమాకు పని చేస్తుండటం చిరు డ్యాన్సుల మీద అంచనాల్ని మరింత పెంచుతోంది. యూనిట్ సభ్యులందరూ కూడా చిరు డ్యాన్సుల గురించి గొప్పగా చెబుతున్నారు. ఇంకో 40 రోజుల్లోనే చిరు నృత్యాల్ని తెరమీద చూసేయబోతున్నాం. ఈ లోపే ఈ సినిమాకు సంబంధించిన డ్యాన్స్ బిట్ ఒకటి లీకైపోయింది.

యూనిట్లో ఎవరో మొబైల్‌ తో చాటు నుంచి తీసిన వీడియో బిట్ అది. చిరు తనదైన శైలిలో స్టెప్పులేస్తూ కనిపించారు. కాకపోతే ఆ వీడియో క్లారిటీ లేదు. దేవిశ్రీ ప్రసాద్ వాయిస్‌ లో ఓ మాస్ పాటకు స్టెప్పులేశాడు చిరు. ఆ పాటను చిత్రీకరణ కోసం దేవిశ్రీ రఫ్ గా పాడినట్లున్నాడు. బహుశా అది ఒరిజినల్ సాంగ్ కాకపోవచ్చేమో. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూశాక చిరు డ్యాన్సుల కోసం అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగిపోతుందనడంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు