ఇలా మోహన్ లాల్ కు మాత్రమే సాధ్యం

ఇలా మోహన్ లాల్ కు మాత్రమే సాధ్యం

ఇటు తెలుగులో అయినా.. అటు తమిళంలో అయినా.. స్టార్ హీరోలు ఏడాదికి ఒక సినిమానే చేస్తుంటారు. కొంచెం కష్టపడితే రెండు సినిమాలు చేయగలుగుతారు. అంతకుమించి సినిమాలు చేసే స్టార్ హీరో ఎవరూ కనిపించరు. కానీ మలయాళంలో మోహన్ లాల్ ఎంత పెద్ద సూపర్ స్టారో చెప్పాల్సిన పని లేదు. ఆయన ఈ ఏడాది ఐదో సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. ఆల్రెడీ ఆయన మలయాళంలో ఈ ఏడాది 'ఒప్పం'.. 'పులి మురుగన్' సినిమాల్లో నటించారు. మోహన్ లాల్ అంధుడిగా నటించిన 'ఒప్పం' సూపర్ హిట్టవగా.. మాస్ రోల్ చేసిన 'పులి మురుగన్' మలయాళ సినిమా రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తూ ఆల్ టైం బ్లాక్ బస్టర్ అయింది. ఇక తెలుగులో 'మనమంతా' లాంటి మంచి సినిమాతో పాటు 'జనతా గ్యారేజ్' లాంటి బ్లాక్ బస్టర్‌లో నటించాడు లాల్.

ఈ ఏడాది మోహన్ లాల్ నటించిన ఐదో సినిమా కూడా ప్రేక్షకుల ముందుకొచ్చేస్తోంది. అదే.. ముంతిరివల్లికల్ తలిర్కుంబోల్'. ఇది మోహన్ లాల్ ఇంతకుముందు నటించిన సినిమాలన్నింటికీ భిన్నమైంది. సగటు మధ్య తరగతి మనిషిగా భార్యను విపరీతంగా ప్రేమించే వ్యక్తిగా నటిస్తున్నాడు మోహన్ లాల్ ఇందులో. 'దృశ్యం' తర్వాత మళ్లీ మీనాతో కలిసి లాల్ నటిస్తున్న చిత్రమిది. దీని ట్రైలర్ కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. జికు జాకబ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ నెల 22న భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ చిత్రం. ఒప్పం.. పులి మురుగన్ రెండూ తెలుగులోకి అనువాదమయ్యాయి. పులి మురుగన్ మంచి విజయం సాధించింది. 'ఒప్పం' నెలాఖర్లో రాబోతోంది. లాల్ కొత్త సినిమా కూడా తెలుగులోకి అనువాదమయ్యే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English