నాలుగు సినిమాలు కలిపితే సింగం-3

నాలుగు సినిమాలు కలిపితే సింగం-3

తమిళ దర్శకుడు హరి తీసే సినిమాల్ని పరిశీలిస్తే.. మామూలు సినిమాలకు అవి చాలా భిన్నంగా కనిపిస్తాయి. సినిమా అంతటా ఉరుకులు పరుగుల మీద ఉన్నట్లుగా ఉంటుంది. ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినట్లుగా ప్రతి సన్నివేశం కూడా చాలా వేగంగా సాగిపోతుంటుంది. మామూలుగా ఉండే సినిమాలతో పోలిస్తే హరి సినిమాల్లో కనీసం 50 శాతమైనా సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. సన్నివేశాల్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి.. ఎక్కువ సీన్స్ ఇరికిస్తుంటాడతను.

హరి సినిమాల్లో ఎక్కడా సన్నివేశం నిలబడటం అన్నది ఉండదు. ఎడిటింగ్ అంత షార్ప్‌గా ఉంటుంది. ముఖ్యంగా సింగం సిరీస్‌లో వచ్చిన రెండు సినిమాలు ఇందుకు ఉదాహరణగా నిలుస్తాయి. ఆ సినిమాల్లో కెమెరా పరుగులు పెడుతుంటుంది. సన్నివేశాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంటాయి. సినిమా జెట్ స్పీడుమీద నడుస్తుంటుంది. ఐతే ఇప్పుడు ఈ సిరీస్‌లో రాబోయే కొత్త సినిమా ‘ఎస్-3’ అయితే గత రెండు సినిమాలతో పోలిస్తే మరింత వేగంగా సాగబోతోందని అర్థమవుతోంది.

ఎందుకంటే మామూలుగా ఒక సినిమాలో 70 నుంచి 90 సీన్ల దాకా ఉంటాయి. ఐతే ‘ఎస్-3’లో ఏకంగా 365 సీన్లు ఉంటాయట. మరీ అన్ని సీన్లు తీసి.. సినిమాలో ఎలా ప్లేస్ చేశారో ఏమో కానీ.. ఇదే నిజమైతే మాత్రం ‘ఎస్-3’ ఇండియాలో అత్యధిక సన్నివేశాలు కలిగిన సినిమాగా రికార్డు సృష్టించడం ఖాయం. మరి ఈ సినిమా ఎడిటర్‌కు హరి ఎంత పని పెట్టి ఉంటాడో.. అతడి బుర్ర ఎంతగా వేడెక్కిపోయి ఉంటుందో అంచనా వేయొచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English