రామోజీ బ్రాండుకు మంచు లక్ష్మి అంబాసిడర్

రామోజీ బ్రాండుకు మంచు లక్ష్మి అంబాసిడర్

పచ్చళ్ల వ్యాపారంతో ప్రస్థానం మొదలుపెట్టి.. ఆపై ‘ఈనాడు’ పత్రిక పెట్టి తన వ్యాపార సామ్రాజ్యాన్ని అనితరసాధ్యమైన రీతిలో విస్తరించారు రామోజీ రావు. ప్రస్తుతం రామోజీ గ్రూప్‌‌లో పదికి పైగా సంస్థలున్నాయి. ఐతే అవన్నీ కూడా చాలావరకు రామోజీకి ఉన్న గుడ్ విల్ మీదే నడుస్తున్నాయి. పోటీ సంస్థలతో పోలిస్తే రామోజీ గ్రూపు సంస్థలకు సంబంధించిన ఉత్పత్తులకు పబ్లిసిటీ కోసం పెట్టే ఖర్చు చాలా తక్కువ.

మన సినీ తారల్ని.. ఇతర ప్రముఖుల్ని రామోజీ గ్రూప్ ప్రమోషన్ కోసం ఉపయోగించుకునేదే కాదు. ఐతే ఈ మధ్య కొంచెం మార్పు వచ్చి.. ప్రమోషన్ కోసం సెలబ్రెటీల్ని ఉపయోగించుకుంటున్నారు. మార్గదర్శి గ్రూప్ కోసం ప్రపంచ మాజీ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకుని ఆయనతో ప్రచారం చేయిస్తున్నారు. తాజాగా మంచు లక్ష్మిని కళాంజలి కోసం బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకోవడం విశేషం.

మామూలుగా కళాంజలి యాడ్స్ కోసం మనకు అంతగా పరిచయం లేని మోడల్స్‌ను పెట్టేవాళ్లు. వాళ్లకే చీరలు అలంకరించి యాడ్స్ వదిలేవాళ్లు. ఐతే ఇప్పుడు సడెన్‌గా మంచు లక్ష్మికి కళాంజలి చీరలు కట్టించి పబ్లిసిటీ మొదలుపెట్టారు. ఇవాళ ఈనాడు పత్రికలో మంచు లక్ష్మి ఉన్న కళాంజలి యాడ్ పెద్దది వేశారు. ఇలా రామోజీ గ్రూప్‌లో ఒక బ్రాండుకు మంచు లక్ష్మి ప్రచారం చేయడం అన్నది కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు