సోగ్గాడు కాదు.. బాబు బాగా బిజీ

సోగ్గాడు కాదు.. బాబు బాగా బిజీ

'సోగ్గాడు' అనేది మంచి టైటిలే కానీ.. ఇప్పటికే దాన్ని తెలుగులో రెండుసార్లు వాడారు. మళ్లీ అదే టైటిల్ పట్టుకుని వేలాడ్డం ఎందుకు అనుకున్నారేమో అవసరాల శ్రీనివాస్ కొత్త సినిమాకు పేరు మార్చేశారు. బాబు బాగా బిజీ.. ఇదీ అవసరాల సినిమాకు పెట్టిన కొత్త పేరు. క్యాచీగా.. సరదాగా అనిపించేలా మంచి టైటిలే పెట్టింది చిత్ర బృందం.

ఇక్కడ మాట్లాడుకుంటున్న సినిమా.. బాలీవుడ్లో హిట్టయిన అడల్ట్ కామెడీ మూవీ 'హంటర్'కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. రొమాన్స్.. అడల్ట్ కామెడీ డోస్ బాగా ఉండే సినిమా ఇది. మిస్తీ చక్రవర్తి.. తేజస్వి మదివాడ.. శ్రీముఖిలతో పాటు సుప్రియ ఐసోలా అనే మరో అమ్మాయి కూడా నటిస్తోంది ఇందులో. డిస్ట్రిబ్యూషన్ నుంచి ప్రొడక్షన్లోకి వచ్చిన అభిషేక్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో నవీన్ మేడారం అనే కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు.

ఈ మధ్యే రిలీజైన ప్రిలుక్ పోస్టర్ ఆసక్తి రేకెత్తించింది. త్వరలోనే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేయనున్నారు. అవసరాల ఇందులో సెక్స్ అడిక్ట్ పాత్రలో కనిపించబోతుండటం విశేషం. కామెడీ టైమింగ్ లో తిరుగులేని అవసరాల.. ఇలాంటి చిలిపి పాత్రలో ఎలా చెలరేగిపోతాడో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అతను లీడ్ రోల్ చేస్తున్న తొలి సినిమా కూడా ఇదే కావడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English