శ‌ర్వానంద్.. మ‌హానుభావుడు

శ‌ర్వానంద్.. మ‌హానుభావుడు

ర‌న్ రాజా ర‌న్.. మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు.. ఎక్స్‌ప్రెస్ రాజా.. ఇలా ఏడాదిన్న‌ర వ్య‌వ‌ధిలో మూడు హిట్లు కొట్టేసి హ్యాట్రిక్ హీరో అయిపోయాడు శ‌ర్వానంద్. ప్ర‌స్తుతం దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్లో 'శ‌త‌మానం భ‌వ‌తి' లాంటి క్రేజీ ప్రాజెక్టు చేస్తున్నాడు.

దీంతో పాటు చంద్ర‌మోహ‌న్ అనే యువ ద‌ర్శ‌కుడితో అగ్ర‌నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మాణంలోనూ ఓ సినిమాను కూడా పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు. వీటి త‌ర్వాత శ‌ర్వా.. మ‌రో క్రేజీ ప్రాజెక్టు చేయ‌బోతున్నాడు. టాలెంటెడ్ యంగ్ డైరెక్ట‌ర్ మారుతి ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర్వా సినిమా చేయ‌నున్నాడు.

మ‌ధ్య‌లో మారుతి-శర్వా సినిమాపై కొంచెం సందేహాలు నెల‌కొన్నాయి కానీ.. ఈ ప్రాజెక్టు ప‌క్కా అన్న‌ది తాజా స‌మాచారం. ఎందుకంటే ఈ చిత్రానికి టైటిల్ కూడా ఓకే అయిపోయింది. 'మ‌హానుభావుడు' అనే ఆస‌క్తిక‌ర టైటిల్‌తో ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్నాడు మారుతి.

శర్వా సరసన కృష్ణగాడి వీర ప్రేమగాథ ఫేం మెహరీన్ హీరోయిన్ గా నటిస్తుంద‌ట‌. నిర్మాత ఎవ‌ర‌న్న సమాచారం బ‌య‌టికి రాలేదు. 'భ‌లే భ‌లే మ‌గాడివోయ్' త‌ర‌హాలోనే టిపిక‌ల్ కామెడీ ఎంట‌ర్టైన‌ర్ స్క్రిప్టును శ‌ర్వా కోసం రెడీ చేస్తున్నాడ‌ట మారుతి. 'బాబు బంగారం' తేడా కొట్టిన నేప‌థ్యంలో ఇప్పుడు మారుతి త‌నేంటో రుజువు చేసుకోవాల్సిన ప‌నిలో ఉన్నాడు. ఐతే శ‌ర్వా సినిమా కంటే ముందు అత‌ను హ‌వీష్ హీరోగా ఓ సినిమా చేయ‌నున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English