ధృవ పెద్ద కొండే ఎక్కాలి..

ధృవ పెద్ద కొండే ఎక్కాలి..

'ధృవ' కంటెంట్ ఉన్న సినిమా అన్న సంగ‌తి టీజ‌ర్.. ట్రైల‌ర్ చూస్తేనే అర్థ‌మైంది. ఇది త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ 'త‌నీ ఒరువ‌న్‌కు 'రీమేక్ అన్న సంగ‌తి తెలిసిందే. అది మామూలు సినిమా కాదు. కంటెంట్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. సినిమా చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. సురేంద‌ర్ రెడ్డి మాతృక‌ను చెడ‌గొట్ట‌కుండా బాగానే తీర్చిదిద్దిన‌ట్లుగా ఉన్నాడు.

 మొత్తంగా సినిమా మీద ఫుల్ పాజిటివ్ బ‌జ్ ఉంది. పైగా తెలుగులో భారీ సినిమా వ‌చ్చి చాలా కాలం అవుతోంది. కాబ‌ట్టి 'ధృవ' క‌లెక్ష‌న్లు ఆశాజ‌న‌కంగా ఉంటాయ‌నే భావిస్తున్నారు. కాక‌పోతే పెద్ద నోట్ల ర‌ద్దు ప్ర‌భావం ఇంకా క‌లెక్ష‌న్ల‌పై ఉంది. దాన్ని ఎంత‌మేర‌కు 'ధృవ' త‌గ్గిస్తుంది.. క‌లెక్ష‌న్లు సాధిస్తుంది అన్న‌దే ఆస‌క్తిక‌రం.

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో 'ధృవ' లాభాల బాట ప‌ట్టాలంటే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అద్భుత ప్ర‌ద‌ర్శ‌నే చేయాలి. ఈ సినిమాకు ఏకంగా 56 కోట్ల దాకా థియేట్రిక‌ల్ బిజినెస్ జ‌రిగింది మ‌రి. ఈ లెక్క‌లు పెద్ద నోట్ల ర‌ద్దుకు ముందు నాటివి. ఈ నిర్ణ‌యం త‌ర్వాత ఏమైనా మార్పులున్నాయేమో తెలియ‌దు.

బ‌య్య‌ర్లు ఏమేర‌కు డ‌బ్బులు క‌ట్టార‌న్న‌దీ స్ప‌ష్ట‌త లేదు. ఐతే రామ్ చ‌ర‌ణ్ లాస్ట్ మూవీ 'బ్రూస్ లీ' డిజాస్ట‌ర్ అయినా.. 'ధృవ‌'కు బిజినెస్ రికార్డు స్థాయిలో జ‌రిగింది. నైజాంలో రూ.13.5 కోట్లు.. సీడెడ్లో రూ.9 కోట్లు.. అమెరికాలో రూ.4 కోట్లు.. ఇలా ప్ర‌తిచోటా భారీ రేటు ప‌లికింది 'ధృవ‌'. మ‌రి క‌లెక్ష‌న్లు ఏ స్థాయిలో వ‌స్తాయో చూడాలి. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో రూ.56 కోట్ల షేర్ సాధించ‌డం అంటే పెద్ద టాస్కే. మ‌రి 'ధృవ' ఏం చేస్తాడో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు