అరవింద్‌తో తేడా వచ్చిందని ఒప్పుకున్నాడు

అరవింద్‌తో తేడా వచ్చిందని ఒప్పుకున్నాడు

'తనీ ఒరువన్' సినిమాతో మొత్తం సౌత్ ఇండియా దృష్టిని ఆకర్షించాడు అరవింద్ స్వామి. ఈ సినిమా రిలీజైనపుడు హీరో జయం రవి కంటే కూడా విలన్ పాత్ర చేసిన అరవింద్ గురించే అంతా మాట్లాడుకున్నారు. హిందీ.. తెలుగు భాషల్లో రీమేక్ పనులు మొదలు పెడుతూ అతణ్నే ఆ పాత్ర చేయమన్నారు.

హిందీ వెర్షన్‌కు నో చెప్పేసిన అరవింద్.. తెలుగు వెర్షన్‌లోనూ తాను ముందు చేయననే అన్నాడని.. అతణ్ని అల్లు అరవింద్ బలవంతంగా ఒప్పించాడని వార్తలొచ్చాయి. దీనికి తోడు దర్శకుడు సురేందర్ రెడ్డికి.. అరవింద్ స్వామికి విభేదాలు తలెత్తాయని కూడా ఊహాగానాలు వినిపించాయి.

ఇదే సంగతి సురేందర్ వద్ద ప్రస్తావిస్తే.. ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ''అరవింద్ స్వామి 'ధృవ'లో చేయను అనేమీ అనలేదు. ముందు కొంచెం విముఖంగా ఉన్నప్పటికీ నేను స్క్రిప్టు నరేట్ చేశాక సంతోషంగా ఒప్పుకున్నారు. తెలుగు వెర్షన్ విషయంలో నేను చేసిన మార్పులు ఆయనకు నచ్చాయి. ఆయన పాత్ర తెలుగులో తగ్గించేశామని వస్తున్న వార్తలు శుద్ధ అబద్ధం.

తమిళంలో కంటే తెలుగులో ఆయన పాత్ర కొంచెం ఎక్కువున్నా ఉండొచ్చేమో. ఇక అరవింద్ స్వామి గారికి.. నాకు విభేదాలన్న మాటకొస్తే.. తొలి రోజు మేమిద్దరం షూటింగ్ స్పాట్లో కొంచెం స్ట్రగుల్ అయిన మాట వాస్తవమే. ఐతే తర్వాత ఇద్దరం కలిసి కూర్చుని మాట్లాడుకున్నాం. తర్వాత ఇద్దరికీ మంచి అండర్ స్టాండింగ్ వచ్చింది. షూటింగ్ సాఫీగా సాగిపోయింది'' అని సురేందర్ తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు