నితిన్ హిట్టు కొట్టాడు..

నితిన్ హిట్టు కొట్టాడు..

నితిన్ సినిమా 'అఆ' రిలీజై ఆరు నెలలు దాటిపోయింది. అతడి కొత్త సినిమాలు ఈ మధ్యే మొదలైంది. మరి ఇప్పుడు నితిన్ హిట్టు కొట్టడం ఏంటి అనుకుంటున్నారా..? ఇది సినిమాలకు సంబంధించిన విషయం కాదులెండి. నితిన్ కొత్తగా మొదలుపెట్టిన రెస్టారెంట్‌కు సంబంధించిన సక్సెస్ ఇది.

తన ఫ్రెండ్.. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోనతో కలిసి హైదరాబాద్‌లోని మాదాపూర్లో నితిన్ 'టి గ్రిల్' పేరుతో కొన్ని రోజుల కిందట రెస్టారెంట్ ఆరంభించిన సంగతి తెలిసిందే. ఇది చాలా తక్కువ రోజుల్లోనే మాంచి ఫ్లోటింగ్‌తో కళకళలాడిపోతోంది.

సమంతను తీసుకొచ్చి రెస్టారెంట్‌ను ఆరంభించడం.. ముందు నుంచి సోషల్ మీడియాలో బాగా ప్రమోట్ చేయడంతో 'టి గ్రిల్' సినీ జనాలతో పాటు మాదాపూర్లోని ఐటీ పీపుల్‌ను బాగా ఆకర్షించింది. ఐతే కేవలం ప్రమోషన్ ఉంటే రెస్టారెంట్ హిట్టయిపోదు. అన్నిటికంటే కీలకమైన విషయం.. టేస్ట్.

ఈ విషయంలో నితిన్ రెస్టారెంట్ జనాల్ని బాగానే ఆకట్టుకుంటోంది. ఇక్కడి ఫుడ్ గురించి ఫీడ్ బ్యాక్ చాలా పాజిటివ్‌గా ఉండటంతో రోజు రోజుకూ ఫ్లోటింగ్ పెరుగుతోంది. యాంబియన్స్ బాగుండటం.. ఫుడ్ టేస్టీగా ఉండటంతో జనాలు మళ్లీ మళ్లీ రెస్టారెంటుకు వస్తున్నట్లు చెబుతున్నారు. ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తి అయితే.. 'టి గ్రిల్'లో టేస్ట్ సూపరని.. ఇక్కడ మంత్లీ కార్డులేమైనా ఉంటాయా అని ట్వీట్ పెట్టాడు. మిగతా జనాలు కూడా 'టి గ్రిల్' గురించి పాజిటివ్‌ ఫీడ్ బ్యాకే ఇస్తున్నారు. మొత్తానికి నితిన్ రెస్టారెంట్ బిజినెస్ హిట్టయినట్లే ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు