అమ్మ మరణం.. గుంటూరోడు తగ్గాడు

అమ్మ మరణం.. గుంటూరోడు తగ్గాడు

జయలలిత మరణంతో తమిళనాడు స్తంభించిపోయింది. నిన్న సాయంత్రం నుంచే తమిళనాట అన్ని కార్యకలాపాలు ఆగిపోయాయి. మూడు రోజుల పాటు అందరికీ సెలవులే. వారం రోజుల పాటు సంతాప దినాలు పాటించనున్నారు. ఈ వారం రోజులూ అక్కడ చెప్పుకోదగ్గ కార్యక్రమాలేవీ జరిగే అవకాశం లేదు. ఐతే అమ్మ మరణంతో తెలుగు రాష్ట్రంలో జరగాల్సిన ఓ సినిమా వేడుక కూడా ఆగిపోయింది.

మంచు మనోజ్ కొత్త సినిమా'గుంటూరోడు' టీజర్ లాంచ్ కార్యక్రమాన్ని గుంటూరులో ఈ బుధవారం భారీ ఎత్తున చేయడానికి సన్నాహాలు చేశారు. హీరో హీరోయిన్లు మంచు మనోజ్.. ప్రగ్యా జైశ్వాల్‌తో పాటు దర్శక నిర్మాతలూ అక్కడికి వెళ్లాల్సింది. ఐతే జయలలిత మృతి నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని రద్దు చేశారు. జయలలిత మృతి ప్రభావం తెలుగు రాష్ట్రాలపైనా ఉంది. ముఖ్యంగా చెన్నైతో ఉన్న అనుబంధం దృష్ట్యా ఆంధ్రా ప్రాంతంలో కొన్ని జిల్లాల జనాలు బాధలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వేడుకను రద్దు చేశారు.

కొన్ని రోజుల తర్వాత గుంటూరులోనే ఈ వేడుక నిర్వహిస్తారట.'నా రాకుమారుడు' ఫేమ్ ఎస్కే సత్య దర్శకత్వం వహిస్తున్న'గుంటూరోడు' సినిమాను క్లాప్స్ అండ్ విజిల్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో మంచు మనోజ్ ఊర మాస్ క్యారెక్టర్ చేస్తున్నాడు.'గుంటూరోడు'కు'ప్రేమలో పడ్డాడు' అనే క్యాప్షన్ పెట్టారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు