పవన్‌ సినిమాకి టైటిలదే.. కన్‌ఫర్మ్‌!

పవన్‌ సినిమాకి టైటిలదే.. కన్‌ఫర్మ్‌!

పవన్‌కళ్యాణ్‌ సినిమాకి టైటిల్‌ 'అత్తారింటికి దారేది' అని సాక్షాత్తూ ఆ చిత్ర కథానాయిక సమంత కన్‌ఫర్మ్‌ చేసింది. ఈ టైటిల్‌ పరిశీలనలో ఉందనే వార్తలు ఎప్పట్నుంచో వినిపిస్తున్నాయి. అయితే అధికారిక సమాచారం లేకపోవడంతో ఈ టైటిల్‌ పెడతారో లేదోననే డౌట్‌ అలాగే ఉంది.

కానీ తన తదుపరి చిత్రాల వివరాలు చెబుతూ సమంత 'అత్తారింటికి దారేది' టైటిల్‌ ఖరారు చేసింది. అలాగే తన పెళ్లి పుకార్లకి కూడా సమంత ఫుల్‌స్టాప్‌ పెట్టింది. ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం లేదని, తాను ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నానని, ఏడు సినిమాల షూటింగ్స్‌ పూర్తి చేయాలని, అందుకే కొత్త చిత్రాలేవీ అంగీకరించడం లేదని సమంత చెప్పింది.

తన పెళ్లి గురించిన సమాచారం తానే ఇస్తానని, అందాకా దాని గురించి మాట్లాడుకోనక్కర్లేదని తేల్చేసింది. సిద్ధార్థ్‌తో ప్రేమలో ఉందనేది అందరికీ తెలిసినా కానీ దాని గురించి మాట్లాడేందుకు మాత్రం సమంత ఇష్టపడ్డం లేదు. సిద్ధార్థ్‌ కూడా తన పర్సనల్‌ విషయాల గురించి మాట్లాడకపోవడం సమంజసమని మీడియాకి హితవు చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English