బాహుబలి తర్వాత ఘాజీనే

బాహుబలి తర్వాత ఘాజీనే

'బాహుబలి' సినిమాను హిందీలో రిలీజ్ చేయడం ద్వారా లక్కీ హ్యాండ్ అనిపించుకున్నాడు కరణ్ జోహార్. ఈ సినిమాను హిందీలో కరణ్ రిలీజ్ చేయడం ఉభయతారకంగా పని చేసింది. దాని వల్ల సినిమాకు మేలు జరిగింది. అలాగే కరణ్ కూడా బాగా లాభపడ్డాడు. ఇప్పుడు కరణ్ దృష్టి మరోసారి సౌత్ సినిమాల మీద పడింది. ఆల్రెడీ ఆయన రోబో సీక్వెల్ '2.0'ను హిందీలో రిలీజ్ చేయొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టు కరణ్ చేతికి వెళ్లింది. రానా దగ్గుబాటి కథానాయకుడిగా నటిస్తున్న భారీ సినిమా 'ఘాజీ'ని హిందీలో కరణే రిలీజ్ చేయనున్నాడు.

పీవీపీ సినిమా.. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి నిర్మిస్తున్న 'ఘాజీ' హిందీ హక్కుల్ని కరణ్ తీసుకున్నాడు. 'బాహుబలి'ని హిందీలో కరణ్ రిలీజ్ చేయడంలో కీలక పాత్ర పోషించిన రానా.. తాను హీరోగా నటించిన సినిమాను కూడా ఆయనకే అప్పగించాడు. ఈ చిత్రం తెలుగు.. తమిళం..హిందీ భాషల్లో తెరకెక్కుతోంది. ఇండియాలో రానున్న తొలి అండర్ వాటర్ వార్ మూవీ ఇదేనట. 1971 నాటి పాక్ యుద్ధం సమయంలో నీటిలో మునిగిపోయిన ఘాజీ అనే సబ్ మెరైన్ గురించి ఓ ఆసక్తికర పుస్తకం రాసిన సంకల్ప్ రెడ్డి.. ఆ బుక్ ఆధారంగానే ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. దర్శకుడిగా అతడికిదే తొలి సినిమా. ఈ చిత్రంలో తాప్సి కథానాయిక. ఫిబ్రవరి 17న ఘాజీ ప్రేక్షకుల ముందుకొస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English