మాజీ సీఎంలే సింగం-3 కి ప్రేరణ

మాజీ సీఎంలే సింగం-3 కి ప్రేరణ

సింగం సిరీస్ నటుడిగా సూర్యను శిఖరస్థాయిలో నిలబెట్టింది. పోలీస్ పాత్రలతో సూర్యకు రియల్ యాక్షన్ హీరోగా తమిళనాడుతో పాటు తెలుగురాష్ట్రాల్లో కూడా మాస్ ఇమేజ్ ఏర్పరచుకున్నారు. అలాంటిది ఏకంగా మూడు సీక్వెళ్లు తీసే స్థాయిలో సింగం హిట్టైంది.

 సింగం 1 తీసేటప్పుడు.. సింగం 2 తీయాలనుకోలేదని, సింగం 2 తీసేటప్పుడు సింగం 3 అనుకోలేదని సూర్య చెప్పాడు. తనతో పాటు శృతిహాసన్, అనుష్క హీరోయిన్లుగా నటిస్తున్నారని, మరోసారి సింగం మూవీ విశాఖ చుట్టూనే తిరుగుతుందన్నాడు.

 ఈసారి గత సీక్వెళ్ల కంటే బలమైన కథతో వచ్చామని, మాజీ సీఎంలు ఎన్టీఆర్, ఎంజీఆర్ సమయంలో జరిగిన నిజ జీవిత ఘటనే దీనికి స్ఫూర్తి అని చెప్పాడు. సూర్య మాటలతో సింగం 3 పై ఆసక్తి బాగా పెరిగింది. అసలు వాళ్లిద్దరూ సీఎంలుగా ఉన్న సమయంలో జరిగిన ఏ ఘటన చూపిస్తారో అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు