ఎన్టీఆర్ మళ్లీ 'నాన్నకు ప్రేమతో' టైపులో..

ఎన్టీఆర్ మళ్లీ 'నాన్నకు ప్రేమతో' టైపులో..

కెరీర్లో తొలి ఆరేడేళ్లు ఒక రకంగా కనిపించాడు జూనియర్ ఎన్టీఆర్. 'యమదొంగ' సినిమాలో అతణ్ని చూసి జనాలంతా ఒక్కసారిగా షాకైపోయారు. తెలుగులో ఏ స్టార్ హీరో లేనంత లావుగా ఉన్న ఎన్టీఆర్.. ఒక్కసారిగా బక్కచిక్కిపోయి కనిపించేసరికి జనాలు గుర్తుపట్టలేకపోయారు. ఆ తర్వాత 'కంత్రి' సినిమాలోనూ అలాగే బక్కచిక్కి కనిపించాడు. తర్వాత తర్వాత కొంచెం లావై ఐడియల్‌గా తయారయ్యాడు.

'యమదొంగ' తర్వాత తారక్‌లో లుక్ పరంగా అంతటి మేకోవర్ కనిపించింది 'నాన్నకు ప్రేమతో' సినిమాలోనే. ఈ సినిమా కోసం తన అవతారం పూర్తిగా మార్చేశాడు తారక్. ముందు అతడి లుక్ చూస్తే ఏదోలా అనిపించింది కానీ.. తర్వాత జనాలు బాగానే అలవాటు పడ్డారు. యూత్‌లో చాలామంది ఆ లుక్‌ను ఫాలో అయిపోయారు. 'నాన్నకు ప్రేమతో' తర్వాత 'జనతా గ్యారేజ్‌'లో మామూలుగానే కనిపించాడు ఎన్టీఆర్. ఐతే ఇప్పుడు మళ్లీ బాబీ సినిమాకు తన లుక్ పూర్తిగా మార్చేస్తున్నాడట.

'జనతా గ్యారేజ్' సినిమా తర్వాత దాదాపు మూడు నెలలు విరామం తీసుకున్న తారక్.. ఈ మధ్య ఓ ఫంక్షన్లో గుబురు గడ్డంతో వెరైటీగా కనిపించాడు. అప్పటికే బాబీ సినిమాకు ఓకే చెప్పేసిన తారక్.. అందుకోసమే కొత్త లుక్ మార్చుకునే ప్రయత్నంలో పడ్డాడట. ప్రస్తుతం ప్రత్యేకంగా ఒక మేకప్ ఆర్టిస్టును పెట్టుకుని లుక్ మార్చుకునే ప్రయత్నంలో ఉన్నాడట తారక్. కొంచెం బాడీ కూడా తగ్గించుకోబోతున్నాడట. మొత్తానికి 'నాన్నకు ప్రేమతో' తర్వాత ఆ స్థాయిలో మరోసారి మేకోవర్ ఉండబోతోందని సమాచారం. మరి ఈ శుక్రవారం బాబీ సినిమా ప్రారంభోత్సవంలోనే తారక్ కొత్త లుక్‌తో కనిపిస్తాడేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు