బాబు గారు బాగా కమర్షియల్‌ అయిపోయారట

బాబు గారు బాగా కమర్షియల్‌ అయిపోయారట

జగపతిబాబు ఇప్పుడు ఏ సినిమాలో వున్నా కానీ తన ప్రత్యేకత నిలుపుకుంటున్నాడు. తెల్లగడ్డం, తెల్లజుట్టు గెటప్‌కి ఫిక్స్‌ అయిపోయిన జగపతిబాబు వరసపెట్టి విలన్‌ వేషాలు వేసేస్తున్నాడు. జగపతిబాబు వుంటే సినిమాకి వేల్యూ పెరుగుతుందని నిర్మాతలు అతడికి భారీ పారితోషికం ఇచ్చి మరీ పెట్టుకుంటున్నారు.

జగపతిబాబు రేటు ఇప్పుడు అక్షరాలా మూడు కోట్లంట. అంత పారితోషికం ఇచ్చుకోవాలంటే ఖచ్చితంగా భారీ సినిమానే అయి వుండాలి. చిన్న సినిమాలకి అంత పారితోషికం ఇవ్వడం ఇంపాజిబుల్‌. గతంలో చిన్న సినిమాలని జగపతిబాబు పట్టించుకునేవాడని, క్యారెక్టర్‌ నచ్చితే నటించేవాడని, కానీ ఇప్పుడు బాగా కమర్షియల్‌ అయిపోయాడని నిర్మాతలు ఆరోపిస్తున్నారు. జగపతిబాబు కనుక చిన్న సినిమాలకో రేటు, పెద్ద వాటికో రేటు అని పెడితే ఆయనతో చాలా వెరైటీ పాత్రలు చేయించవచ్చునని చిన్న నిర్మాతలు అంటున్నారు.

ఇదంతా జగపతిబాబు దృష్టికి కూడా వచ్చింది కానీ చిన్న సినిమాలకి డేట్స్‌ ఇవ్వడం వల్ల ఏదైనా పెద్ద సినిమా కోల్పోతే తనకి చాలా ఎక్కువ నష్టం వస్తుందని, పైగా ఇప్పుడున్న బూమ్‌ ఎన్నాళ్లుంటుందనేది తనకి తెలియదు కనుక చిన్న నిర్మాతల రిక్వెస్ట్‌ని కన్సిడర్‌ చేస్తే నష్టపోతానని అంటున్నాడు. ఆయన మాట్లాడే దాంట్లో కూడా లాజిక్‌ వుంది కదా. దీపం వున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. వెరైటీ పాత్రలదేముంది... ఖాళీగా వున్నప్పుడు ఎన్నయినా చేసుకోవచ్చు. కోట్లు పోగొట్టుకుంటే తర్వాత ఎవడిస్తాడు?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English