ట్రీట్మెంట్ సూపర్ అంటున్న జగపతి

ట్రీట్మెంట్ సూపర్ అంటున్న జగపతి

హీరోగా ఉన్నప్పటి కంటే కూడా విలన్, క్యారెక్టర్ రోల్స్‌లోకి మారాక తనకు సినీ పరిశ్రమలో మంచి ట్రీట్మెంట్ దక్కుతోందని సంతోషం వ్యక్తం చేశాడు సీనియర్ నటుడు జగపతి బాబు. విలన్ పాత్రల్లోకి మారాక తన కెరీర్ డిఫరెంట్ టర్న్ తీసుకుందని.. ప్రస్తుత స్పేస్‌ను తాను బాగా ఆస్వాదిస్తున్నానని ఆయన చెప్పాడు. మలయాళంలో తాను నటించిన తొలి సినిమా 'పులి మురుగన్' తెలుగులోకి 'మన్యం పులి' పేరుతో విడుదలై మంచి విజయం సాధించిన నేపథ్యంలో జగపతి మీడియాతో మాట్లాడాడు.

''సాధారణంగా విలన్ అంటే కొంచెం చులకన భావంతో చూస్తారు. కానీ నన్నుమాత్రం అందరూ గౌరవంగా చూస్తున్నారు. నా కోసమే 'నాన్నకు ప్రేమతో'లో కృష్ణమూర్తి పాత్రను గౌరవంగా చూపించానని సుకుమార్ ఓసారి చెప్పారు. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో నన్ను హీరో కంటే బాగా చూస్తున్నారు. మలయాళంలో నేను నటించిన తొలి సినిమా 'పులి మురుగన్' వంద కోట్ల గ్రాస్ సాధించిన తొలి సినిమాగా రికార్డు సృష్టించింది. మలయాళ ప్రేక్షకులు నన్ను నా పేరుతో కాకుండా ఈ చిత్రంలో చేసిన  'డాడీ గిరిజ' పాత్ర పేరుతో పిలుస్తున్నారు. అంత మంచి పేరొచ్చింది. తెలుగులోనూ ఈ సినిమా హిట్ కావడం చాలా సంతోషంగా ఉంది. మలయాళంలో మోహన్‌లాల్‌తో మరో సినిమా చేయబోతున్నా. తెలుగులో గోపీచంద్, నాగచైతన్య, సాయిధరమ్ తేజ్‌లతో సినిమాలు చేస్తున్నాను. నేను హీరోగా చేయబోయే 'పటేల్‌ సార్' త్వరలో ప్రారంభమవుతుంది. 60 ఏళ్ల వృద్ధుడికీ, అంధురాలైన చిన్నారికీ మధ్య జరిగే కథతో ఈ సినిమా నడుస్తుంది'' అని జగపతి తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English