ఇక్కడ గ్యారేజ్‌ ఓపెన్‌ చేసేసాడండోయ్‌

ఇక్కడ గ్యారేజ్‌ ఓపెన్‌ చేసేసాడండోయ్‌

మోహన్‌లాల్‌ ఎవరనేది మనవాళ్లకి ఎప్పట్నుంచో తెలుసు. ఆయన నటించిన ఇద్దరు, కాలాపాని తదితర చిత్రాలు తెలుగులో అనువాదమయ్యాయి. అయితే తమిళ హీరోల మాదిరిగా ఆయన ఇక్కడ పాపులర్‌ కాలేదు. ఈ కారణంగానే ఆయన నటించిన 'మనమంతా' చిత్రానికి ప్రేక్షకాదరణ లేకుండా పోయింది. కానీ 'జనతా గ్యారేజ్‌'తో మోహన్‌లాల్‌కి ఇక్కడ ఆదరణ పెరిగింది. అందులో ఆయన చేసిన సత్యం పాత్ర ప్రేక్షకులపై ముద్ర వేసింది. అందుకే మోహన్‌లాల్‌ తాజా చిత్రం 'మన్యంపులి' చిత్రానికి ఓపెనింగ్స్‌ బ్రహ్మాండంగా వచ్చాయి.

సినిమా కూడా బాగుందనే టాక్‌ రావడంతో వసూళ్లు ఇంకా పెరిగాయి. మూడు రోజులు తిరగకుండానే పెట్టుబడి వెనక్కి వచ్చేయడంతో ఈ రైట్స్‌ కొన్నవాళ్లు పండగ చేసుకుంటున్నారు. మోహన్‌లాల్‌ సినిమాకి వచ్చిన రెస్పాన్స్‌ చూసి ఆయన నటించిన మరో చిత్రం 'ఒప్పమ్‌'ని కూడా తెలుగులోకి అనువదిస్తున్నారు. ఇందులో మోహన్‌లాల్‌ గుడ్డివాడి పాత్ర చేసాడు. మలయాళంలో విజయం సాధించిన ఈ చిత్రానికి ఇక్కడా ఆదరణ వుంటుందని ఆశిస్తున్నారు. చూస్తుంటే లేటు వయసులో మోహన్‌లాల్‌ మన మార్కెట్లో పాగా వేసినట్టే ఉన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English