చిరంజీవితో హిట్టు కొడితే మహేష్‌తో పక్కా

చిరంజీవితో హిట్టు కొడితే మహేష్‌తో పక్కా

కాజల్‌ అగర్వాల్‌ ఒకప్పుడు భారీ హిట్‌ చిత్రాల్లో నటించింది కానీ 'టెంపర్‌' తర్వాత ఆమెకి ఏదీ కలిసి రావడం లేదు. కాజల్‌ నటించిన ఏ భాష చిత్రమైనా బాక్సాఫీస్‌ వద్ద మట్టి కరిచేస్తోంది. సర్దార్‌ గబ్బర్‌సింగ్‌, బ్రహ్మూెత్సవం చిత్రాలతో కాజల్‌కి ఐరెన్‌లెగ్‌ అనే ముద్ర వేసేసారు. ప్రస్తుతం చిరంజీవి 150వ చిత్రమైన 'ఖైదీ నంబర్‌ 150'లో నటిస్తోన్న కాజల్‌ దీని మీదే ఆశలు పెట్టుకుంది. ఇది కానీ హిట్టయితే తనని మళ్లీ హిట్‌ హీరోయిన్‌గా కన్సిడర్‌ చేస్తారని కాజల్‌ ఎదురు చూస్తోంది.

ఈ చిత్ర ఫలితంపై ఆధారపడి ఆమెకి మరికొన్ని అవకాశాలు ఎదురు చూస్తున్నాయి. ఖైదీ కానీ హిట్టయితే మహేష్‌తో చిత్రంలో నటిస్తుందని వినిపిస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌ హీరోగా నటించే చిత్రంలో కాజల్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారట. అయితే ఇంతవరకు డాటెడ్‌ లైన్‌పై సంతకమైతే చేయలేదు. ఖైదీ నంబర్‌ 150 ఫలితాన్ని బట్టి కాజల్‌ని ఖరారు చేయాలా, లేక మరో హీరోయిన్‌ కోసం వెతకాలా అనేది చూస్తారట. వంశీ పైడిపల్లి అయితే కాజల్‌తో టచ్‌లోనే వున్నాడు మరి. బ్రహ్మూెత్సవం తర్వాత ఈ కాంబినేషన్‌ రిపీట్‌ చేస్తామంటే ప్రిన్స్‌ ఫాన్స్‌ ఎలాంటి గొడవ చేస్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు