తెలుగు నిర్మాత.. సెల్వ రాఘవన్‌తో

తెలుగు నిర్మాత.. సెల్వ రాఘవన్‌తో

ఓవైపు 14 రీల్స్ బేనర్ మీద రామ్ ఆచంట.. గోపీనాథ్ ఆచంటలతో కలిసి భారీ సినిమాలు తీస్తూనే.. మరోవైపు సొంతంగా 'ఏకే ఎంటర్టైన్మెంట్స్' బేనర్లో చిన్న సినిమాలు తీస్తుంటాడు అనిల్ సుంకర. ఏడాదికి కనీసం మూడు సినిమాలైనా వస్తుంటాయి ఈ బేనర్ నుంచి. ఈ బేనర్ మీద రెండంకెల సంఖ్యలో సినిమాలు తీశాడు అనిల్ సుంకర. చివరగా దసరాకు 'ఈడు గోల్డ్ ఎహే' సినిమాతో పలకరించాడు అనిల్ సుంకర. ఆయన ఇప్పుడు తొలిసారి తమిళంలో ఓ సినిమాను నిర్మించబోతున్నాడు. విలక్షణ దర్శకుడు సెల్వ రాఘవన్‌తో ఆయన సినిమా చేస్తుండటం విశేషం.

ఎస్.జె.సూర్య హీరోగా 'నెంజం మరప్పుదిల్లై' పేరుతో ఓ హార్రర్ థ్రిల్లర్ తీసిన సెల్వ రాఘవన్.. తన తర్వాతి సినిమాను కమెడియన్ టర్న్డ్ హీరో సంతానంతో చేస్తుండటం విశేషం. ఈ చిత్రానికి అనిల్ సుంకర నిర్మాణ భాగస్వామి కావడం విశేషం. ఇటీవలే ఈ చిత్రం ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. మామూలుగా ఏళ్లకు ఏళ్లు సినిమాలు తీసే సెల్వ రాఘవన్.. ఈ సినిమాను మూడు నెలల్లోనే ముగించేయనున్నాడు. దీని తర్వాత అతడికి స్టార్ హీరో సూర్యతో కమిట్మెంట్ ఉంది. ఆ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో సెట్స్ మీదికి వెళ్తుంది. కమెడియన్‌గా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన సంతానం.. మన సునీల్ తరహాలోనే హీరోగా మారాడు. వరుస విజయాలతో అతడి కెరీర్ బాగానే సాగుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు