సూపర్‌స్టార్‌ని లెక్క చేయని కమెడియన్‌

సూపర్‌స్టార్‌ని లెక్క చేయని కమెడియన్‌

సాధారణంగా ఒక పెద్ద హీరో సినిమా వస్తుందంటే దానికి ఎదురు వెళ్లడానికి చిన్న హీరోలు జంకుతారు. ఏదో విధంగా తమ సినిమాని వాయిదా వేసుకుని లౌక్యం ప్రదర్శిస్తారు. అయితే సూర్యలాంటి సూపర్‌స్టార్‌ సినిమా అనౌన్స్‌ చేసినా కానీ దాంతోనే పోటీకి దిగుతానంటున్నాడు కమెడియన్‌ సప్తగిరి.
ఈ స్టార్‌ కమెడియన్‌ హీరోగా నటించిన మొదటి చిత్రం 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' సరాసరి సూర్య నటించిన 'ఎస్‌ 3' అలియాస్‌ 'యముడు 3'తో పోటీకి దిగుతోంది. సింగం సిరీస్‌పై అంచనాలు ఏ స్థాయిలో వున్నాయనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మాస్‌ విరగబడి చూసే ఈ చిత్రానికి పోటీగా సప్తగిరి సినిమా రిలీజ్‌ చేయడం సాహసమే. ఎందుకంటే సప్తగిరి చిత్రానికి కూడా మాస్‌ ఆదరణే ముఖ్యం. వారిని టార్గెట్‌ చేసుకుని ఈ చిత్రానికి ఫ్రీ స్పేస్‌ దొరికితే సేఫ్‌ అయ్యే అవకాశాలెక్కువ.

కానీ ఎస్‌ 3కి భయపడి వాయిదా వేసుకుంటే, క్రిస్మస్‌ సెలవులు మిస్‌ అయిపోవాల్సి వస్తుందని, డిసెంబర్‌ 23నే విడుదల చేయడానికి ఫిక్సయ్యారు. సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌లో పొట్టపగిలే కామెడీ వుంటుందని, అదే ఈ చిత్రానికి శ్రీరామరక్ష అవుతుందని భావిస్తున్నారు. మరి ఈ ఎక్స్‌ప్రెస్‌కి యముడి వల్ల యాక్సిడెంట్‌ అవుతుందో, లేక సింహాన్నే ఈ ఎక్స్‌ప్రెస్‌ కబళించేస్తుందో చూద్దామిక.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు