కొత్త సినిమాల పొజిషనేంటి..?

కొత్త సినిమాల పొజిషనేంటి..?

పెద్ద నోట్ల రద్దు ప్రభావం సినిమాల మీద ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ సినిమాల విడుదలకు నిర్మాతలు ముందుకు రావట్లేదు. దీంతో గత రెండు వీకెండ్లలో చిన్నస్థాయి సినిమాలే వచ్చాయి.

ఈ శుక్రవారం అయితే చెప్పుకోదగ్గ తెలుగు సినిమాలేవీ రాలేదు. చాన్నాళ్ల నుంచి విడుదల కోసం ఎదురు చూస్తున్న సాయిరాం శంకర్ మూవీ 'అరకు రోడ్లో' రిలీజైంది. దీంతో పాటు రెండు డబ్బింగ్ సినిమాలు (బేతాళుడు, మన్యం పులి) ప్రేక్షకుల ముందుకొచ్చాయి.

ఈ వారం వచ్చిన మూడు సినిమాల్లో 'మన్యం పులి' బెటర్ అని చెప్పొచ్చు. మోహన్ లాల్ కథానాయకుడిగా మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన 'పులి మురుగన్'ను 'మన్యం పులి' పేరుతో తెలుగులోకి అనువదించారు. అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు.. కళ్లు చెదిరే విజువల్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కథాకథనాలు గొప్పగా ఏమీ లేకున్నా.. టైంపాస్ చేయించేస్తుంది 'మన్యం పులి'. మోహన్ లాల్ నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఈ సినిమాకు ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి.

మంచి అంచనాల మధ్య రిలీజైన 'బేతాళుడు' ఈ వారం సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్స్ తెచ్చుకుంది. 'బిచ్చగాడు' ఎఫెక్ట్ ఈ సినిమా మీద బాగా పని చేసింది. ఐతే సినిమా అంచనాలకు తగ్గట్లు లేకపోవడంతో రెండో రోజు కలెక్షన్లు తగ్గాయి. ఈ సినిమా మీద రూ.3 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టారు. అది రికవర్ కావడం కొంచెం కష్టమే. ఇక 'అరకు రోడ్లో' పరిస్థితి ఏమంత బాగా లేదు. ఈ సినిమాకు ఓపెనింగ్సే లేవు. పైగా టాక్ కూడా పాజిటివ్‌గా లేదు. దీంతో సాయిరాం శంకర్‌కు మరోసారి నిరాశ తప్పేలా లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English