అల్లుతో ఏ లింకూ లేదండీ బాబూ!

అల్లుతో ఏ లింకూ లేదండీ బాబూ!

అల్లు అరవింద్‌ చిన్న కొడుకు శిరీష్‌ హీరోగా మొదటి సినిమాతో చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. అతను అసలు హీరో మెటీరియలే కాదని విమర్శకులు ముక్త కంఠంతో చీల్చి చెండాడేశారు. అయినా కానీ రెండో సినిమాతో పుంజుకుంటాననే నమ్మకంతో శిరీష్‌ ఉన్నాడు.

ఇదిలా ఉంటే మొదటి సినిమా ఫట్టయినా కానీ అల్లు శిరీష్‌ గాసిప్‌ కాలమ్స్‌ని మాత్రం ఆకర్షించగలిగాడు. గౌరవం చిత్రంలో తనతో కలిసి నటించిన యామీ గౌతమ్‌తో అతనికి అఫైర్‌ ఉందని గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. అయితే ఈ పుకార్లని యామీ తిప్పికొట్టింది.

తామిద్దరం కలిసి ఐపీఎల్‌ మ్యాచ్‌లకి వెళ్లినంత మాత్రాన ఏదో ఉందని కాదని చెప్పింది. చాలా మంది స్నేహితులతో కలిసి వెళ్లినా తమ ఇద్దరినే కలిపి ఫోటోలు తీస్తున్నారని, మిగతా వాళ్లు తెలియకపోవడం వల్ల తామే హైలైట్‌ అవుతున్నామని వివరణ ఇచ్చింది. తనకి శిరీష్‌తోనే కాదు, ఎవరితోను లింక్‌ లేదని, ప్రస్తుతం తన దృష్టి అంతా కెరీర్‌ మీదే ఉందని యామీ గౌతమ్‌ స్పష్టం చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English