పూరీ జగన్నాథ్‌కి హీరోలు దొరకట్లేదు

పూరీ జగన్నాథ్‌కి హీరోలు దొరకట్లేదు

'ఇజం' తర్వాత పూరి జగన్నాథ్‌తో పని చేయడానికి ఏ హీరోలు ఆసక్తి చూపుతున్నట్టు లేరు. మొదట్లో కేవలం అగ్ర హీరోలతోనే పని చేసిన పూరి ఈమధ్య యువ హీరోలతో సినిమాలు చేసుకుంటున్నాడు. అయితే కథల విషయంలో శ్రద్ధ తీసుకోకుండా తనకి తోచినట్టు సినిమాలు తీస్తోన్న పూరి జగన్నాథ్ తీరు వల్ల నిర్మాతలు భారీగా మూల్యం చెల్లించుకుంటున్నారు. ఇజం చిత్రానికి మితి మీరి ఖర్చు చేయించడం వల్ల కళ్యాణ్‌రామ్‌కి భారీగా నష్టం వచ్చిందట. హీరోగా తన ఇమేజ్ ఏమైనా మారుతుందేమోనని ఆశిస్తే అది కూడా జరగకపోవడంతో కళ్యాణ్‌రామ్ బాగా నిరాశ చెందాడు. ఈమధ్య పూరితో పని చేసిన హీరోలు, నిర్మాతలు అందరికీ ఇలాంటి అనుభవమే ఎదురైంది.

టెంపర్ చిత్రానికి కథ వేరే రచయితది కావడం వల్ల ఆ చిత్రం యావరేజ్‌గా అయినా ఆడిందని, పూరి కథలకి అయితే తల, తోక వుండడం లేదని విమర్శలొస్తున్నాయి. మాస్లో ఇంకా మంచి పేరే వున్నా కానీ కథల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న పూరి జగన్నాథ్ మళ్లీ మునుపటి మాదిరిగా ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి లాంటి కథలు రాసి సత్తా చాటుకుంటే తప్ప హీరోలు అతనిపై ఆసక్తి చూపించరేమో. అసలే కొత్త దర్శకులు చాలా మంది రావడమే కాకుండా వారిలో చాలా మంది ప్రతిభావంతులు వుండడంతో ఇప్పుడు హీరోలకి ఆప్షన్లు పెరిగిపోయాయి. ఇంకా పూర్వ వైభవం పేరుతో హీరోల డేట్లు సంపాదిద్దామంటే కుదరదు మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English