ఒక హీరోయిన్తో విడాకులు.. ఇంకో హీరోయిన్తో పెళ్లి

ఒక హీరోయిన్తో విడాకులు.. ఇంకో హీరోయిన్తో పెళ్లి

ఆయ‌నొక స్టార్ హీరో. మ‌రో స్టార్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఇద్ద‌రూ 16 ఏళ్ల పాటు వైవాహిక బంధాన్ని కొన‌సాగించారు. వాళ్లిద్ద‌రికీ ఒక కూతురు కూడా ఉంది. ఐతే ఆ హీరోకు ఒక హీరోయిన్‌తో ఎఫైర్ ఉంద‌ని కొన్నేళ్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. వాళ్లిద్ద‌రూ క‌లిసి 20కి పైగా సినిమాలు కూడా చేశారు. ఇంత‌లో ఆ హీరోయిన్‌కు వేరే వ్య‌క్తితో పెళ్ల‌యింది. కానీ రెండేళ్ల‌కే ఆమె అత‌డి నుంచి విడాకులు తీసుకుంది.

మ‌రోవైపు ఆ స్టార్ హీరోకు త‌న భార్య‌తో పొస‌గ‌లేదు. అత‌నూ ఆమె నుంచి విడాకులు తీసుకున్నారు. దీంతో వీళ్లిద్ద‌రి బంధం గురించి రోజు రోజుకూ వ‌దంతులు మ‌రింత తీవ్రమ‌య్యాయి. ఇప్పుడు ఊహాగానాల‌న్నింటికీ తెర‌దించుతూ ఆ ఇద్ద‌రూ పెళ్లి చేసుకుని ఒక్క‌ట‌య్యారు.

ఇదీ మ‌ల‌యాళ స్టార్ హీరో దిలీప్.. స్టార్ హీరోయిన్ కావ్య మాధ‌వ‌న్‌ల క‌థ‌. వీళ్లిద్ద‌రూ గ‌త శుక్ర‌వార‌మే పెళ్లి చేసుకున్నారు. దిలీప్ వ‌య‌సు 48 ఏళ్లు కాగా.. కావ్య మాధ‌వ‌న్ వ‌య‌సు 32 ఏళ్లే కావ‌డం విశేషం. కావ్య ఏడేళ్ల‌కే చైల్డ్ ఆర్టిస్టుగా న‌టించింది. 14 ఏళ్ల వ‌య‌సులోనే హీరోయిన్ అయింది. ఆమె తొలి సినిమాలో దిలీపే హీరో.

త‌ర్వాత ఇద్ద‌రూ క‌లిసి 21 సినిమాలు చేశారు. దిలీప్ మాజీ భార్య మంజు వారియ‌ర్ మ‌ల‌యాళంలో ఫేమ‌స్ హీరోయిన్. ప్ర‌స్తుతం ఈమె నాగార్జున‌తో క‌లిసి క‌ళ్యాణ్ జువెల‌ర్స్ యాడ్లోనూ క‌నిపిస్తోంది. కావ్య‌తో దిలీప్ పెళ్లికి అత‌డి కూతురు మీనాక్షి హాజ‌రై.. చాలా ఉల్లాసంగా గ‌డ‌ప‌డం విశేషం. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు