కోన నిజంగానే కొంప ముంచాడా?

కోన నిజంగానే కొంప ముంచాడా?

ఎన్టీఆర్ కొత్త సినిమా కథ మళ్లీ మొదటికి వచ్చినట్టు మీడియాలో ఒక వర్గం కోడై కూస్తోంది. బాబీతో ఎన్టీఆర్ సినిమా దాదాపు ఖరారైనట్టే అని ఖచ్చితమైన సమాచారం వస్తోన్న దశలో ఈ వార్త కలకలం రేపింది. ఎన్టీఆర్‌కి బాబీ చెప్పిన కథని కోన వెంకట్ ఇంతకుముందే అభిషేక్‌బచ్చన్‌కి అమ్మేసాడని, ఇప్పుడు ఎన్టీఆర్ ఓకే చెప్పడంతో అభిషేక్‌ని బుజ్జగించి దానిని వెనక్కి తెచ్చుకోవాలని చూస్తున్నారని గుసగుసలు మొదలయ్యాయి. అయితే దీనిపై కోన, బాబీ ఇద్దరూ సైలెంట్‌గా వున్నారు. ఇంతవరకు ఈ ప్రాజెక్ట్ గురించి వారు అఫీషియల్‌గా ఏమీ మాట్లాడలేదు.

ఎన్టీఆర్ అనౌన్స్ చేసే వరకు దీనిపై మౌనం వహించడమే బెస్ట్ అని వాళ్లు అనుకుంటున్నారు. ఎన్టీఆర్‌తో పని చేయడానికి చాలా మంది దర్శకులు సిద్ధంగా వున్నా కానీ బెస్ట్ ఆప్షన్ ఏమిటా అని ఎన్టీఆర్ ఆలోచిస్తున్నాడు. అందుకే తనకి నచ్చిన కథ దొరికినా కానీ అధికారికంగా ప్రకటించడం లేదు. ఒకవేళ నిజంగా అభిషేక్‌బచ్చన్‌కి కోన ఈ కథ అమ్మేసి వున్నట్టయితే అతడి నుంచి తిరిగి రైట్స్ తెచ్చుకోవడం పెద్ద తలనొప్పే. వారంలోగా ఈ ప్రాజెక్ట్‌ని అధికారికంగా ప్రకటించాలని ఎన్టీఆర్ భావిస్తోన్న దరిమిలా ఈ వ్యవహారం చక్కదిద్దడానికి కోన దగ్గర ఆట్టే సమయం కూడా లేదాయె.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు