నిర్మాతని ఏడిపించుకు తింటోన్న జయసుధ

నిర్మాతని ఏడిపించుకు తింటోన్న జయసుధ

సీనియర్ నటీనటులకి డిసిప్లిన్ ఎక్కువని ఇండస్ట్రీలో చెప్పుకుంటూ వుంటారు. అయితే కొందరు మాత్రం స్పాట్‌కి టైమ్‌కి రావడానికి అంతగా ఆసక్తి చూపించరట. వారిలో సీనియర్ నటి జయసుధ కూడా వున్నట్టు సమాచారం. ప్రస్తుతం జయసుధ 'హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య' అనే చిత్రంలో విప్లవ చిత్రాల నాయకుడు ఆర్. నారాయణమూర్తి భార్య పాత్ర చేస్తున్నారు. చదలవాడ స్వీయ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ సడన్‌గా ఆగిపోయింది. దీనికి కారణం జయసుధ అని భోగట్టా. తరచుగా షూటింగ్‌కి లేట్‌గా వస్తోన్న జయసుధతో చదలవాడ షూటింగ్‌కి సమయానికి రావాలని చెప్పారట. దాంతో జయసుధకి కోపం వచ్చి, ఆయనతో వాగ్వాదానికి దిగి సెట్నుంచి ఉన్నపళంగా వెళ్లిపోయి, మళ్లీ ఆ షూటింగ్‌కి వెళ్లలేదట.

ఆమెని కాంటాక్ట్ చేయడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కానీ జయసుధ నుంచి బదులు రాలేదట. కీలకమైన పాత్ర చేస్తున్న జయసుధ లేకపోవడంతో షూటింగ్ షెడ్యూల్ మొత్తం అప్సెట్ అయి సినిమా మధ్యలో నిలిచిపోయిందట. ఇప్పుడు ఆమెకి బదులుగా మరొకర్ని తీసుకోవాలా లేక తననే బతిమాలుకోవాలా తెలీక చదలవాడ తల పట్టుకున్నారట. జయసుధని రీప్లేస్ చేసినట్టయితే ఇంతవరకు షూటింగ్ చేసిన దాంట్లో చాలా భాగం వృధా అయి బడ్జెట్ పరిధులు దాటిపోతుందట. అదండీ సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు