ఇవేం కలెక్షన్లు బాబోయ్

ఇవేం కలెక్షన్లు బాబోయ్

ఈ ఏడాది పెద్దగా అంచనాల్లేని కొన్ని చిన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనమే సృష్టించాయి. క్షణం.. పెళ్లి చూపులు లాంటి సినిమాలు ఎవ్వరూ ఊహించని విధంగా కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇప్పుడు 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' కూడా అదే స్థాయిలో హవా సాగిస్తోంది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో జనాలు థియేటర్లకు వస్తారా.. కలెక్షన్లు ఎలా ఉంటాయో.. అన్న సందేహాల మధ్య విడుదలైన ఈ సినిమా తొలి రోజు తొలి రెండు షోలకు ఓ మోస్తరు వసూళ్లు సాధించింది. కానీ సాయంత్రానికి అనూహ్యంగా వసూళ్లు పుంజుకున్నాయి. టాక్ అదిరిపోవడంతో ఫస్ట్ షో నుంచి హౌస్ ఫుల్స్ పడ్డాయి.

ఇక ఫస్ట్ వీకెండ్ అంతా అదరగొట్టేసి రూ.11 కోట్ల దాకా గ్రాస్ వసూళ్లు రాబట్టిన 'ఈపీసీ'.. వీక్ డేస్లోనూ స్టడీగా సాగిపోయింది. రెండో వీకెండ్ వచ్చాక మళ్లీ వసూళ్లు పెరిగాయి. శని, ఆది వారాల్లో ఓ కొత్త సినిమా తరహాలో వసూళ్లు రాబట్టింది. జయమ్ము నిశ్చయమ్మురా, రెమో సినిమాల కంటే దీని కలెక్షన్లే ఎక్కువున్నాయి. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఫస్ట్ డే కలెక్షన్ల కంటే కూడా సెకండ్ వీకెండ్లో ఆదివారం నాటి కలెక్షన్లు ఎక్కువగా ఉండటం విశేషం. ప్రస్తుతం వీక్ డేస్లో కూడా ఈ సినిమాకు హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా గ్రాస్ రూ.25 కోట్ల మార్కును దాటేసినట్లు అంచనా. నిఖిల్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'నే అయ్యేలా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు